మహేష్‌తో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న 'మహర్షి' చిత్రం వచ్చే వేసవిలో విడుదలకి సిద్ధమవుతోంది. ముగ్గురు నిర్మాతలు చేతులు కలిపిన ఈ చిత్రానికి బడ్జెట్ అవధులు దాటేస్తోందనే వార్తలొస్తున్నాయి. వర్కింగ్ డేస్ ఎక్కువ వుండడం, విదేశాల్లో భారీ షెడ్యూల్స్ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌పై కంట్రోల్ లేకుండా పోయింది.
ముగ్గురు నిర్మాతలు వుండడంతో ఎవరో ఒకరు అథారిటీ తీసుకుని బడ్జెట్‌ని అదుపులో వుంచే వీల్లేకుండా పోతోందట. వంశీ పైడిపల్లిపై కంట్రోల్ లేనపుడు ఓవర్ స్పెండ్ చేయిస్తాడనే టాక్ వుంది. ఊపిరి చిత్రానికి బడ్జెట్ ఎక్కువైపోవడంతో సినిమా బ్రహ్మాండంగా ఆడినా కానీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందని, నష్టాలొచ్చాయని నిర్మాత పివిపినే ప్రకటించారు.
ఖర్చుకి అనుగుణమైన రేట్లకి విక్రయించడం వల్ల సినిమా పెద్ద హిట్ కాకపోతే బయ్యర్లు నష్టపోయే పరిస్థితి వస్తోంది. తెలుగు సినిమా హిట్ రేంజ్ వందకోట్లు దాటినా కానీ యావరేజ్ సినిమాలు ఇంకా ఎనభైకోట్ల స్థాయిలోనే వున్నాయి. ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్ కాలేదు కనుక ఈ అంచనాని కూడా దృష్టిలో వుంచుకుని మార్కెట్ చేస్తే బాగుంటుందని ట్రేడ్ వర్గాల అభిమతం.
24 పెయిన్స్!.. ఈ 24 ముద్దులు.. చదవండి సినిమా రివ్యూ: 24 కిస్సెస్