ఇండస్ట్రీలో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ పైరసీతో మాత్రం పెట్టుకోకూడదు. వాళ్లపై సవాళ్లు విసిరితే హీరోలకే నష్టం. ఈ విషయాన్ని విశాల్ నిరూపించాడు. పైరసీ వాళ్లకు ఛాలెంజ్ చేసి తన మార్కెట్ చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా పైరసీ వాళ్లతో పెట్టుకున్నాడేమో అనిపిస్తోంది.
టాక్సీవాలా సినిమా విడుదలకు ముందే లీక్ అయింది. అయితే ఇది అసలైన పైరసీ కిందకు రాదు. కొంతమంది కాలేజీ కుర్రాళ్ల అత్యుత్సాహం వల్ల అలా జరిగింది. ఆ తర్వాత అది పైరసీ చేసే వాళ్ల చేతిలోకి వెళ్లింది. వాళ్లు రకరకాల సైట్స్ లో టాక్సీవాలా సినిమాను అప్ లోడ్ చేశారు.
పైరసీ చూడొద్దంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేయడం మాత్రమే హీరోల పని. అంతేతప్ప పైరసీ సైట్లను కంట్రోల్ చేయాలనుకోవడం, పైరసీ చేసే వాళ్లకు వార్నింగ్ ఇవ్వాలనుకోవడం లాంటివి జరిగే పనులు కావు. పైపెచ్చు నష్టమే ఎక్కువ జరుగుతుంది. విజయ్ మాత్రం పైరసీవాళ్లతో పెట్టుకున్నాడు. టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇప్పుడు సక్సెస్ మీట్ లో ఏకంగా వాళ్లపై సెటైర్లు వేశాడు.
“కొన్ని సైట్లు మా సినిమాను లీక్ చేశారు. ఇప్పుడు నేను పైరేట్స్ అందరికీ సారీ చెబుతున్నాను. మీకు చాలా మందితో మిడిల్ ఫింగర్స్ చూపించాను. అందుకే సారీ చెబుతున్నాను. చిన్నచిన్న పిల్లలు కూడా వచ్చి విజయ్ అన్నా పైరసీ వాళ్లకు మిడిల్ ఫింగర్ చూపించాం అంటున్నారు. ఇకనైనా ఇలాంటి పనులు మానుకోండి.”
విజయ్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ కచ్చితంగా అతడ్ని ఇబ్బందులకు గురిచేస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఇలా రెచ్చిపోయినందుకే విశాల్ నటించిన ప్రతి సినిమా పైరసీకి గురవుతోంది. చెప్పి మరీ విశాల్ సినిమాల్ని రిలీజైన మొదటిరోజే అప్ లోడ్ చేస్తున్నారు పైరసీగాళ్లు.
ఇది అతడి తమిళ మార్కెట్ పై చాలా ప్రభావం చూపిస్తోంది. ఇదే విధంగా విజయ్ దేవరకొండను కూడా పైరసీగాళ్లు టార్గెట్ చేస్తే ఈ హీరో తట్టుకోగలడా? ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న విజయ్ దేవరకొండ, తన యాటిట్యూడ్ ను పైరసీచేసే వాళ్లపై చూపించకుండా ఉండడమే మంచిదంటున్నారు చాలామంది.
24 పెయిన్స్!.. ఈ 24 ముద్దులు.. చదవండి సినిమా రివ్యూ: 24 కిస్సెస్