రవితేజకి ప్రతి సినిమాకి పది కోట్లకి పైగానే పారితోషికం ముడుతుందనేది ఇండస్ట్రీ టాక్. తనకి అంత మొత్తం ఇచ్చిన వారికే రవితేజ డేట్స్ ఇస్తుంటాడట. ఈమధ్య హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని తన పారితోషికంగా డిమాండ్ చేస్తున్నాడనే టాక్ వుంది. 'అమర్ అక్బర్ ఆంటొని'కి అలాగే పదిహేను కోట్ల వరకు అతని చేతికి వెళ్లాయనే ప్రచారం జరిగింది.
మిగతావన్నీ పక్కన వుంచి, పది కోట్ల స్థాయిలో ప్రతి సినిమాకి ఛార్జ్ చేస్తున్నాడని అనుకున్నా కానీ అతని గత మూడు చిత్రాలు కూడా థియేటర్స్ నుంచి కనీసం తన పారితోషికాన్ని అయినా వసూలు చేయలేకపోయాయి. 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు' చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడి ఫ్లాపయి తొమ్మిది కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంటే, 'అమర్ అక్బర్ ఆంటొని' మరింత దారుణమైన వసూళ్లు రాబట్టుకుంది.
ఆరుకోట్ల లోపు షేర్‌తోనే ఈ చిత్రం సరిపెట్టుకోనుంది. పడిపోతున్న రవితేజ మార్కెట్‌తో ఇకపై అతను అడిగింది చెల్లించడానికి నిర్మాతలు సాహసించకపోవచ్చు. పారితోషికంపై పెడుతోన్న శ్రద్ధ కథల ఎంపికపై పెట్టడం లేదని, అతని సినిమా తీయడమంటే గాలిలో దీపంలా అయిపోతోందనే విమర్శలు పెరుగుతోన్న నేపథ్యంలో రవితేజ జాగ్రత్త పడకపోతే ప్రమాదం తప్పదు.
24 పెయిన్స్!.. ఈ 24 ముద్దులు.. చదవండి సినిమా రివ్యూ: 24 కిస్సెస్