రజనీకాంత్‌కి వయసయిపోయింది. ఆయన ఇదివరకటిలా డాన్సులు వేయలేరు, స్టంట్లు చేయలేరు. కానీ, ఆయన స్టైల్ మాత్రం ఇంకా అభిమానుల్ని అలరిస్తూనే వుంది. చిన్న పిల్లలు సైతం రజనీకాంత్ స్టైల్‌ని ఫాలో అవుతుంటారు. అదీ రజనీకాంత్ ప్రత్యేకత. ఇంతకీ, ఇప్పుడిదంతా ఎందుకంటే.. '2.0' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ టైమ్‌లో రజనీకాంత్, '2.0' సంగతుల గురించి చెబుతూ, అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు.
'2.0' సినిమా కోసం బరువైన బాడీ సూట్ వాడాల్సి వచ్చింది. అది రోబో 'చిట్టి' గెటప్ కోసం. అంత బరువైన ఆ సూట్ మోయడమంటే రజనీకాంత్‌కి కష్టమైన వ్యవహారమే. పైగా, షూట్ సమయంలో రజనీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. ఆ కారణంగా, చాలావరకు 'డూప్'తో పనికానిచ్చేశారన్న ప్రచారం జరుగుతోంది.
'నేను అనారోగ్యంతో బాధపడ్డాను. ఆ సమయంలో శంకర్, బాడీ సూట్ వేసుకోవద్దని చెప్పారు.. ఇంకొకరితో చేద్దామన్నారు. కానీ, నేను ఒప్పుకోలేదు..' అంటూ రజనీకాంత్ తానుపడ్డ కష్టం గురించి చెప్పినా, రజనీకాంత్ చెప్పిన మాటలు ఇంకోలా 'కన్వే' అవుతున్నాయి.
'రోబో' సినిమాలోనూ రజనీకాంత్ 'చిట్టి' గెటప్‌లో బాడీ సూట్‌తో కన్పించిన విషయం విదితమే. అప్పుడూ, 'డూప్'తో పని కానిచ్చేశారనే విషయం బయటపడిపోయింది. '2.0' సినిమాకి వచ్చేసరికి రజనీకాంత్ ఆరోగ్యం ఏమాత్రం సహకరించలేదన్నది ఓపెన్ సీక్రెట్.
నిజానికి, శంకర్ '2.0' సినిమా కోసం పలువురు హీరోల పేర్లను పరిశీలించాడు.. కుదరక రజనీకాంత్‌తో సరిపెట్టేశాడు. మొత్తమ్మీద, రజనీకాంత్ స్టార్డమ్.. ఆ స్టార్డమ్ కారణంగా పెరిగిన అంచనాలు '2.0' సినిమాకి విపరీతమైన క్రేజ్‌ని తెచ్చేశాయి.
6,800 థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నారు. 600 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.. మరి, ఇంత కష్టం.. '2.0' సినిమాని నిలబెడ్తుందా.? వేచి చూడాల్సిందే.
24 పెయిన్స్!.. ఈ 24 ముద్దులు.. చదవండి సినిమా రివ్యూ: 24 కిస్సెస్