ఈ మధ్యనే సోషల్ మీడియాలో టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఓ పోస్ట్ పెట్టారు. 'జెర్సీ నోస్ నో జెండర్' అన్న హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ పెట్టిన మిథాలీ రాజ్, సెమీ ఫైనల్‌లో సత్తా చాటేందుకు మహిళా టీమిండియా సిద్ధంగా వుందని చెప్పారు. అయితే, సెమీస్‌లో టీమిండియా పరాజయం పాలయ్యింది. క్రికెట్ అన్నాక గెలుపోటములు సహజమే.! కానీ, ఇక్కడో ఝలక్ వుంది. ఆ ఝలక్, మిథాలీ రాజ్‌కి తగిలింది. అసలు ఆ మ్యాచ్‌లో ఆమె ఆడలేదు మరి.!
మిథాలీ రాజ్, టీ20 సిరీస్‌లో మంచి జోరుతోనే వుంది. పలు మ్యాచ్‌లలో టీమిండియాని గెలిపించింది కూడా. అలాంటి ఆమెను సెమీస్‌లో ఆడించలేదు. అదే ఓటమికి కారణమంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది.
టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది మిథాలీ రాజ్. అలాంటి మిథాలీని, సెమీస్‌లో ఆడించకపోవడం ఆశ్చర్యకరమే. కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్, మేనేజర్, సెలక్టర్.. ఇలా అందరూ కలిసి మిథాలీ రాజ్‌ని పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారట.
'అసలు ఆమెను ఎంపిక చేయకపోవడమన్నది పెద్ద విషయమే కాదు..' అంటూ మ్యాచ్ తర్వాత తలెత్తిన వివాదంపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. 'క్రికెట్‌లో ఇలాంటి రాజకీయాలు మామూలే' అని కొందరు అభిప్రాయపడ్తోంటే, ఈ తరహా రాజకీయాలు మహిళా క్రికెట్‌నీ నాశనం చేస్తున్నాయనే విమర్శలు ఇంకోపక్క వెల్లువెత్తుతున్నాయి.
మెన్స్ క్రికెట్‌కి సంబంధించి రాజకీయాల్ని చూస్తూనే వున్నాం. ఈ రాజకీయాలు ఇప్పటివి కావు. బాగా ఆడుతోన్న యువ క్రికెటర్లపై సీనియర్ క్రికెటర్ల పెత్తనం.. రిటైర్‌మెంట్ దగ్గరపడ్డ క్రికెటర్లను అమర్యాదకరంగా జట్టు నుంచి పక్కకు పంపడం.. ఇప్పటిదాకా మెన్స్ క్రికెట్‌కే పరిమితమని అందరూ భావించారు.
దురదృష్టవశాత్తూ ఆ జాడ్యం మహిళా క్రికెట్ టీమ్‌కి కూడా పట్టిందన్నది మెజార్టీ అభిప్రాయం. 'జెర్సీ నోస్ నో జెండర్' అన్నమాట ఎలావున్నా, 'క్రికెట్ పాలిటిక్స్ నోస్ నో జెండర్' అని అనుకోవాల్సి వస్తోందిప్పుడు.
భారత మహిళా క్రికెట్‌కి గర్వకారణమైన మిథాలీని ఇంతలా అవమానించాలా.? అన్న సగటు క్రికెట్ అభిమానికి సమాధానమిచ్చేదెవరు.?
24 పెయిన్స్!.. ఈ 24 ముద్దులు.. చదవండి సినిమా రివ్యూ: 24 కిస్సెస్