ప్రముఖ నటుడు శరత్‌కుమార్ తన తండ్రి అని, ఆయన భార్య రాధికా శరత్‌కుమార్ మాత్రం తల్లి కాదని హీరోయిన్ వరలక్ష్మి సంచలన ప్రకటన చేసింది. నటి వరలక్ష్మి సంచలనాలకు మారుపేరు. నిన్నటి వరకు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై పలు ఆరోపణలు చేసి చర్చకు తావిచ్చిన విషయం తెలిసిందే. ఆ చర్చ సాగుతుండగానే ఆమె మళ్లీ నోరు తెరిచింది.
కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి విదేశాల్లో పెరిగింది. ఆమె బెల్లీ డ్యాన్సర్ అనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. పోడాపోడీ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అంగత్తె ఆ తర్వాత కన్నడంలో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో చిత్రపరిశ్రమలోనూ అడుగు పెట్టింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి పలు అంశాలపై నిర్భయంగా, నిర్మొహమాటంగా సమాధానాలు చెప్పి…తెగువ, ధైర్యానికి ఆమెకు ఆమే సాటి అని నిరూపించుకొంది. తనకు కోపం ఎక్కువని, రౌడీనని, చిన్న వయసు నుంచి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో తనతో మాట్లాడడానికి చాలా మంది భయపడతారని అమాయకంగా చెప్పిందామె.
మరో విషయాన్ని కూడా వరలక్ష్మీశరత్‌కుమార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. నటి రాధికశరత్కుమార్ను తల్లిగా భావించడం లేదని స్పష్టంగా చెప్పింది. శరత్‌కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి అనే విషయం తెలిసిందే. రాధికను ఆంటీ అనే పిలుస్తానని చెప్పింది. ఎందుకంటే ఆమె తన తల్లి కాదని, తన తండ్రి రెండవ భార్య మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు వరలక్ష్మి చెప్పింది.
తనకే కాదు ఎవరికైనా అమ్మ కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఉంటారని స్పష్టం చేసింది. అందుకే రాధిక తనకు తల్లి కాదని, ఆంటీ అని అదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించింది. కానీ తన తండ్రి శరత్‌కుమార్‌తో సమానంగా రాధికను గౌరవిస్తానని వరలక్ష్మీ చెప్పడం గమనార్హం. వరలక్ష్మి అమాయకత్వం, కల్మషం లేని తనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?