అది సుధీర్‌బాబు సినిమాయేనా.?

సుధీర్‌బాబు హీరోగా ఓ సినిమా ఆ మధ్యన లాంఛనంగా ప్రారంభమయ్యింది. మెహరీన్‌ ఆ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పులి వాసు…

సుధీర్‌బాబు హీరోగా ఓ సినిమా ఆ మధ్యన లాంఛనంగా ప్రారంభమయ్యింది. మెహరీన్‌ ఆ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పులి వాసు దర్శకుడు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా ప్రారంభమయ్యింది.

'ప్రొడక్షన్‌ నెంబర్‌ 2' అంటూ అప్పట్లో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. కానీ, ఇప్పుడు అదే బ్యానర్‌లో అదే ప్రొడక్షన్‌ నెంబర్‌ 2 అంటూ, మెగాస్టార్‌ చిరంజీవి చిన్న అల్లుడు 'విజేత' ఫేం కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది.

దర్శకుడు కూడా పులి వాసునే. ఇదే బ్యానర్‌లో గతంలో 'నాటకం' అనే సినిమా రూపొందిందనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ, కళ్యాణ్‌దేవ్‌ ఓకే చేసిన సినిమా.. గతంలో సుధీర్‌బాబు ఒప్పుకున్నదేనా.? సుధీర్‌ – మెహ్రీన్‌ కాంబినేషన్‌లో సినిమా అటకెక్కి, కళ్యాణ్‌దేవ్‌తో సినిమా షురూ అయ్యిందా.?

ఓ హీరో కోసం అనుకున్న సినిమా ఇంకో హీరోతో పట్టాలెక్కడం కొత్తేమీకాదు. సో, ఇది కూడా అదేబాపతు అనుకోవాలేమో. ఇదిలావుంటే, కళ్యాణ్‌దేవ్‌ సరసన మెహ్రీన్‌నే హీరోయిన్‌గా ఖరారు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

అంటే, హీరో మాత్రమే మారాడనుకోవాల్సి వస్తుంది. అన్నట్టు, సుధీర్‌బాబు సినిమా కోసం తీసుకున్న తమన్‌నే, కళ్యాణ్‌దేవ్‌ సినిమాకీ సంగీత దర్శకుడిగా అనౌన్స్‌ చేయడం గమనార్హం.

తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్