కూకట్ పల్లి తెలుగుదేశం అభ్యర్థిని సుహాసిని చుండ్రు (నందమూరి తండ్రి ఇంటిపేరు. చుండ్రు భర్త ఇంటిపేరు) సమర్థతపై తనకు పూర్తి నమ్మకం వుందని, ఆమె గెలుస్తారనే విసెష్ ను నటుడు జగపతి బాబు వ్యక్తం చేసారు. బాగానేవుంది. ఆ డిజైన్ కార్డునే ఇప్పుడు తెలుగుదేశం జనాలు పబ్లిసిటీ ప్రచారానికి వాడుకుంటున్నారు. అదీ బాగానే వుంది.
కానీ ఒకటే అనుమానం, నామినేషన్ లో భర్త పేరు దగ్గర లేదా పేరు రాయాల్సి వచ్చిన ప్రతిచోటా హరికృష్ణ పేరునో, లేదా కొన్నిచోట్ల వైపాఫ్ హరికృష్ణ అనో రాసేసారు సుహాసిని అని వార్తలు వచ్చాయి. ఎక్కడ ఏది రాయాలో కూడా తెలియనంత అమాయకం అయితే, మరి సమర్థత అని జగపతి బాబు ఎలా అంటారు?
నందమూరి బాలకృష్ణ సంగతే చూద్దాం. ఆయన హైదరాబాద్ లో వుంటారు. ఆయన నియోజక వర్గంలో ఎవరు అందుబాటులో వుంటున్నారు? ఇప్పటికి ఇద్దరు ఇన్ చార్జ్ లను మార్చారు. రకరకాల ఆరోపణలు రావడంతో, పార్టీ జనాలు గొడవ చేయడంతో ఇద్దరిని మార్చి లేటెస్ట్ గా లోకేష్ మూడో ఇన్ చార్జిని పంపారు. అంటే ఇలా ఇన్ చార్జ్ లతో పాలించుకోవడానికా, జనం బాలయ్యను గెలిపించింది.?
సుహాసిని గెలిస్తే ఎక్కడ వుంటారు? తల్లితో ఇప్పుడున్న ఇంట్లోనా? లేక కూకట్ పల్లిలో జనాలకు అందుబాటులోనా? ఇవేవీ తెలియకుండా, సామాజిక బంధాలతోనో, సినిమా బంధాలతోనో, జగపతి బాబు లాంటి వాళ్లు ప్రకటనలు చేయడం ఏమిటి? జనాలకు భవిష్యత్ లో జవాబు చెప్పే బాధ్యత కూడా జగపతి బాబు తీసుకోగలరా?
తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్