థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా దాని డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిందని వార్తలు వస్తున్నాయి. ప్రీరిలీజ్ మార్కెట్లో మూడువందల కోట్ల రూపాయల మార్కెట్ ను చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అందులో సగం మొత్తాన్నికూడా సాధించలేదని స్పష్టం అవుతోంది. దీంతో దీనిపై పెట్టుబడులు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు సగానికి సగం మునిగినట్టే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వారు నష్ట పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
యశ్ రాజ్ ఫిలిమ్స్ వంటి భారీ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను రూపొందించింది. మార్కెటింగ్ కూడా భారీఎత్తున చేసింది. తీరా ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ సినిమా ఇతర పెట్టుబడిదార్లను కూడా భారీగా నష్టపరిచింది. ఈ నేపథ్యంలో తమకు పరిహారాన్ని కట్టించాలని వారు వైఆర్ఎఫ్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆమిర్ స్పందించాలని, అమితాబ్ కూడా స్పందించాలని కోరుతున్నారు.
అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను ఇలా నిండా ముంచేయడం పట్ల ఇప్పటివరకూ ఆమిర్ స్పందించలేదు. సినిమా పోవడం గురించి ఏదో మాట్లాడాడు కానీ.. భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారి ఊసు ఎత్తడంలేదు. ఈ మధ్య బాలీవుడ్ లో కూడా పరిహారాలు కట్టించే విధానం కొనసాగుతోంది.
తమ సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టి లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు పరిహారాలు చెల్లించారు. ట్యూబ్ లైట్ కు గానూ సల్మాన్, జబ్ హ్యారీ మెట్ సెజల్ వంటి డిజాస్టర్ కు గానూ షారూక్ డిస్ట్రిబ్యూటర్లకు రీ పే చేయించారు. మరి మిస్టర్ పర్ ఫెక్షనిస్టు ఆమిర్ మాత్రం ఇంకా స్పందించలేదు.
ఆసక్తిదాయకంగా 'పోల్ తెలంగాణ'… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్