యావరేజ్ సినిమా కేశవ తరువాత డైరక్టర్ సుధీర్ వర్మ చెక్కుతున్న సినిమా ఒకటి వుంది. శర్వానంద్ హీరో. ఈ సినిమా ప్రారంభమై కాస్త ఎక్కువకాలమే అయింది. అయినా ఇంకా ముఫై నుంచి నలభైశాతం షూట్ పెండింగ్ లో వుంది. ఈ సినిమాకు ఓ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు వినిపిస్తోంది.
ఈ సినిమాలో శర్వానంద్ రెండు రకాల షేడ్స్ వున్న పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ క్యారెక్టర్ తో పాటు, నలభై ఏళ్ల సీనియర్ మాఫియా లీడర్ పాత్రలో కూడా కనిపిస్తాడు. డబుల్ రోల్ కాదు. నాయకుడు సినిమా మాదిరిగా ఓ మాఫియా లీడర్ కథ అన్నమాట.
ఇప్పడు ఈ సినిమాకు కూడా తమిళ టైటిల్ నే ఆలోచిస్తున్నట్లు తెలుస్తొంది. అలనాటి సూపర్ హిట్ టైటిల్ 'దళపతి'ని ఈ సినిమాకు పెట్టాలని సుధీర్ వర్మ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం నాయకుడు టైపు కథకు, అదే మణిరత్నం దళపతి సినిమా టైటిల్ అన్నమాట. భలేగా వుందిగా.
ఆసక్తిదాయకంగా 'పోల్ తెలంగాణ'… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్