రామ్ తాళ్లూరి, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం తన టైమ్, తన డబ్బులు ఖర్చు చేస్తున్న ఎన్నారై కమ్ నిర్మాత. రామ్ తాళ్లూరి ఇప్పటికే చాలా డబ్బులు జనసేన కోసం ఖర్చు చేసారని ఇండస్ట్రీలో టాక్. అలాంటి రామ్ తాళ్లూరి ముచ్చటను మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇట్టే తొసి పక్కనపెట్టారు.
విషయం ఏమిటంటే, రామ్ తాళ్లూరి నిర్మించబోయే సినిమాలో మెగా యంగ్ హీరోతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తారని వార్తలు వచ్చాయి. నిజానికి ఈ వార్తల ఫీలర్ బయటకు వచ్చిందే రామ్ తాళ్లూరి ఆఫీస్ నుంచి. ఇది అధికారిక వార్త కాదు, గ్యాసిప్ గానే అంటూ ఫీలర్ ను ఆ యూనిట్ కు చెందినవారే బయటకు వదిలారు.
మాధ్యమాల్లో ఆ వార్త రాగానే, పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రెస్ నోట్ ఇచ్చేసారు. తాను పూర్తి సమయం ప్రజాసేవకే అంకితం అని, తాను ఏ సినిమా కూడా కమిట్ కాలేదని ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. పాపం, రామ్ తాళ్లూరి ఆనందం కనీసం కొన్ని గంటలైనా నిలవలేదు. కాదు, నిలవనివ్వలేదు పవన్ కళ్యాణ్.
ఆసక్తిదాయకంగా 'పోల్ తెలంగాణ'… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్