ఆ సినిమా బదులు ఈ సినిమా

దువ్వాడ జగన్నాధమ్ లాంటి పెద్ద హిట్ ఇచ్చానని ఎంత ప్రచారం సాగినా, డైరక్టర్ హరీష్ శంకర్ కు మాత్రం మళ్లీ ఇప్పటి వరకు సినిమా చేతిలోకి రాలేదు. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర అయింది.…

దువ్వాడ జగన్నాధమ్ లాంటి పెద్ద హిట్ ఇచ్చానని ఎంత ప్రచారం సాగినా, డైరక్టర్ హరీష్ శంకర్ కు మాత్రం మళ్లీ ఇప్పటి వరకు సినిమా చేతిలోకి రాలేదు. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర అయింది. అదిగో అమెరికాలో కొత్త సినిమాకు రెక్కీ, ఇదిగో కొత్త సినిమాకు హీరోలు అంటూ ఎన్నో గ్యాసిప్ లే తప్ప, సినిమా స్టార్ట్ కాలేదు.

ఆఖరికి ఇప్పుడు అప్పుడెప్పుడో హీరో సిద్దార్థ నటించిన తమిళ సినిమా జిగర్తాండ (ఇది తెలుగులో డబ్ కూడా అయింది) ఆధారంగా తెలుగులో సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయారు. కొంత కాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా వున్న 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇదే సంస్థ గతంలో వరుణ్ తేజ హీరోగా సాగర్ చంద్ర డైరక్షన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసింది. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి చిన్న సినిమా అందించిన సాగర్ చంద్రతో సినిమా అనగానే ఎందుకో వరుణ్ తేజ ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేసినట్లు బోగట్టా. ఏమయితేనేం, ఎలాగైతేనేం, ఆ సినిమా క్యాన్సిల్ అయింది.

కానీ 14రీల్స్ కు వరుణ్ ఓ సినిమా చేయాల్సిన బాకీ మాత్రం వుండిపోయింది. ఇప్పుడు ఆ బాకీని ఈ హరీష్ శంకర్ సినిమాకు వాడాలని ప్రయత్నిస్తున్నారు. కొంతవరకు వరుణ్ ఓకె అన్నాడు. కానీ అసలు కాంబినేషన్ హీరో ఎవరో తేలితే తప్ప, ప్రాజెక్టు పక్కా కాదు. అదీ విషయం.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్