Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ ఎంత పని చేసాడో తెలుసా?

అఖిల్ ఎంత పని చేసాడో తెలుసా?

మరీ భయపడాల్సిన పనిలేదు. కాని పని ఏమీ చేయలేదు అక్కినేని అఖల్. జస్ట్ షర్ట్ విప్పేసి, సిక్స్ ప్యాక్ బాడీ చూపించాడంతే. కుర్ర హీరో చొక్కా విప్పడం, సిక్స్ ఫ్యాక్ బాడీ చూపించడం కొత్తా కాదు, వింతా కాదు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో అక్కినేని అఖిల్ కూడా చేరాడు. అదే వార్త. అక్కినేని అఖిల్ తన మూడో సినిమాగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో మిస్టర్ మజ్ఞు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆరంభంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి వుంది.

ఈ సాంగ్ లో అఖిల్ షర్ట్ విప్పేసి, సిక్స్ ఫ్యాక్ తో డ్యాన్స్ చేసాడట. అయితే ఈ సాంగ్ కోసం షర్ట్ విప్పేస్తే సరిపోలేదు. సిక్స్ ఫ్యాక్ స్క్రీన్ మీద పెర్ ఫెక్ట్ గా ప్రొజెక్ట్ కావాలంటే, దానికి చాలా వ్యవహారాలున్నాయట. పాట షూట్ అయినన్ని రోజులు ఏమీతినకుండా, జస్ట్ ఒక్క లీటర్ వాటర్ మాత్రం తాగుతూ, చాలా కష్టపడ్డాడట.

ఒక దశలో ఈ ఉపవాసాలు,  ఏమీ తాగకపోవడాలు చూసి, ఏమైనా తేడా కొడుతుందేమో అన్న భయంలో ఆక్సిజన్ సిలెండర్ కూడా తెచ్చి, ఫస్ట్ ఎయిడ్ సెటప్ సిద్దంచేసారట. అంతలా కష్టపడి, సిక్స్ ప్యాక్ చూపిస్తూ, అఖిల్ చేసిన సాంగ్ ఎలా వుంటుందో చూడాలి మరి.

బోగవిల్లి ప్రసాద్, బాపినీడు నిర్మించే ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతుంది. తొలిప్రేమ తరువాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా ఇదే.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?