సరిలేరు నీకెవ్వరూ సినిమా రివ్యూల విషయంలో బాగా పెదవి విరుపులు వచ్చిన విషయాల్లో హీరోయిన్ రష్మిక విషయం కూడా ఒకటి! ఆ ఓవర్ స్మార్ట్ క్యారెక్టర్ చాలా సార్లు ప్రేక్షకులను విసిగిస్తుంది. ప్రత్యేకించి సెకెండాఫ్ లో ఆమె చాలా సేపటికి రీ ఎంట్రీ ఇచ్చాకా అయితే ఆ విసుగు మామూలుగా ఉండదు! దీనికి బదులు హీరోయిన్ క్యారెక్టర్ ను తొలి సగానికే పరిమితం చేసినా బాగుండేదన్న అభిప్రాయాలు వినిపించాయి.
మరి ఆ విషయంలో తప్పు ఎవరిదో కానీ, విమర్శలు అయితే తప్పలేదు. హీరోయిన్ క్యారెక్టర్ ను మరీ ఓవర్ స్మార్ట్ గా డిజైన్ చేసిన రచయిత కమ్ దర్శకుడు అనిల్ రావి పూడి ఓవర్ చేశారా, లేక ఆ ఓవర్ స్మార్ట్ క్యారెక్టర్ ను రష్మిక మరింత అతిగా పండించిందో కానీ.. తేడా కొట్టేసింది! ఆ సినిమా తర్వాత అసలు ఇక రష్మిక పరిస్థితి ఏమిటనేంత స్థాయిలో డౌట్లు పుట్టాయి. అయితే ఇంతలోనే 'భీష్మ'లో తన రష్మిక ప్రత్యేకతను చాటుకుంది.
ఆకతాయిలా కనిపించే హీరోకి వరస పెట్టి క్లాసులు పీకే పాత్రలో, తన వెంట పడే హీరోని పరోక్షంగా ఎంటర్ టైన్ చేసే పాత్రలో రష్మిక డీసెంట్ గా కనిపించింది. ఈమె ఇది వరకూ చేసిన గీతాగోవిందం పాత్రను భీష్మ లో హీరోయిన్ పాత్ర గుర్తు చేసింది. రెండు పాత్రలూ కాస్త ఒకే తరహావి. బాధ్యతాయుతంగా, అదే సమయంలో లవ్లీగా సాగే పాత్రలు. వీటికి రష్మిక బాగా సూట్ అవుతున్నట్టుగా ఉంది. అంతే కానీ.. హీరో వెంట పడే సగటు తెలుగు తింగరబుచ్చి హీరోయిన్ పాత్రలకు మాత్రం రష్మిక అంతగా సెట్ అయ్యేట్టుగా లేదు!
సరిలేరు నీకెవ్వరూ సినిమా విషయంలో రష్మిక ఇటీవల మాట్లాడుతూ, ఆ సినిమా విషయంలో తను పూర్తిగా డైరెక్టర్ చెప్పినట్టుగా చేసినట్టుగా, అందులో తన క్రెడిట్ ఏ మాత్రం లేదని కూడా కుండబద్ధలు కొట్టేసింది! ఆ పాత్రను ఎలా చేయాలో ఈ హీరోయిన్ కు నటించి మరీ చూపించాడట దర్శకుడు అనిల్ రావిపూడి!