బాలీవుడ్ లో ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కంటే అతడి చెల్లెలు, జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం సోషల్ మీడియాలో ఆమె ఓ రేంజ్ లో రెచ్చిపోవడమే. ఎక్స్ పోజింగ్ చేయడానికి ఏమాత్రం మొహమాటపడని కృష్ణ (ముద్దు పేరు కృషు) ఎప్పటికప్పుడు తన పేజీలో హాట్ హాట్ ఫొటోలు పెడుతుంటుంది. దీనికి తోడు ఈమద్య తన లవర్ ఎఫైర్ ను కూడా బయటపెట్టడంతో బాయ్ ఫ్రెండ్ తో కలిసి సీక్రెట్ గా చేయాల్సిన పనులన్నీ సోషల్ మీడియాలోనే చేసేస్తోంది.
ఎబాన్ హేమ్స్, కృషు దాదాపు 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని 4 నెలల కిందట మాత్రమే బయటపెట్టింది కృషు. అప్పట్నుంచి వీళ్లిద్దరూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఒకటే బికినీ ఫొటోలు, మూతి ముద్దులు. బెడ్ రూమ్ లో చేయాల్సిన పనులన్నీ వీళ్లు బాహాటంగా సోషల్ మీడియాలో చేసేస్తున్నారు.
ప్రస్తుతం ఈ జంట బీచ్ వెకేషన్ కు (పెళ్లికి ముందు చేసే పనులకు ఈమధ్య ముద్దుగా పెట్టుకున్న పేరు ఇది) వెళ్లింది. అక్కడ ఓ రేంజ్ లో ఇద్దరూ ఎంజాయ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ వ్యవహారంపై అటు కృషు తండ్రి జాకీష్రాఫ్, హీరో అన్నయ్య టైగర్ ష్రాఫ్ మౌనం వహిస్తున్నారు.
అన్నయ్యలానే కృషుకు కూడా జిమ్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ గా ఏదో ఒక ఎక్సర్ సైజ్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఎబాన్ హేమ్స్ పరిచయం అవ్వడం, ఇద్దరూ ఇలా డేటింగ్ లో దిగడం చకచకా జరిగిపోయాయి. ఈ ఎఫైర్ ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.