నటుడు, యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ యాంకర్ తన తండ్రిని కోల్పోయాడు. ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు మరణించారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. కొన్ని రోజుల కిందట పాండురంగకు కరోనా సోకింది. ఆ వైరస్ నుంచి ఆయన కోలుకున్నట్టు తెలుస్తోంది. అంతలోనే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పాండురంగ మృతి చెందినట్టు తెలుస్తోంది.
కొన్నాళ్ల కిందట యాంకర్ ప్రదీప్ కు కూడా కరోనా సోకినట్టు వార్తలొచ్చాయి. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదంటూ వదంతులు వ్యాపించాయి. అయితే వాటిపై అప్పట్లో ప్రదీప్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎప్పట్లానే షూటింగ్స్ లో పాల్గొన్నాడు, టీవీల్లో కనిపిస్తూ వస్తున్నాడు.
అంతకంటే ముందు ప్రదీప్ పై కొన్ని వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వాటన్నింటి నుంచి ఆయన సక్సెస్ ఫుల్ గా బయటపడ్డాడు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఇలా హఠాత్తుగా తన తండ్రిని కోల్పోయాడు ప్రదీప్.
ఇప్పుడిప్పుడే నటుడిగా కూడా రాణిస్తున్నాడు ప్రదీప్. హీరోగా మారి ''30 రోజుల్లో ప్రేమించడం ఎలా'' అనే సినిమా కూడా చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆ సినిమా బాగానే ఆడింది. రీసెంట్ గా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రదీప్. కరోనా వల్ల ఆ సినిమా సెట్స్ పైకి రావడం ఆలస్యమౌతోంది.