సాగర్ తో సత్తా చాటేది ఎవరు?

మరికొద్దిసేపట్లో ఏ విషయం తేలిపోతుంది. సాగర్ కౌంటింగ్ జోరుగా సాగుతోంది. మొదటి రౌండ్ ఫలితం చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది. 25 రౌండ్లలో జరిగనున్న ఈ కౌంటింగ్ లో ముందుగా గుర్రంపోడు, పెద్దవూర…

మరికొద్దిసేపట్లో ఏ విషయం తేలిపోతుంది. సాగర్ కౌంటింగ్ జోరుగా సాగుతోంది. మొదటి రౌండ్ ఫలితం చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది. 25 రౌండ్లలో జరిగనున్న ఈ కౌంటింగ్ లో ముందుగా గుర్రంపోడు, పెద్దవూర మండలాల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఈ ఫలితం మరికాసేపట్లో రాబోతోంది.

తెలంగాణ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో నాగార్జున సాగర్ ఉపఎన్నిక అనివార్యమైంది. అప్పటికే గ్రేటర్ ఎన్నికలతో మంచి ఊపు మీదున్న బీజేపీ, సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

అటు సిట్టింగ్ స్థానం కావడంతో టీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్ లో ఎదురైన పరాభవం  సాగర్ లో రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈసారి ఏకంగా సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. అలా సాగర్ ఉప ఎన్నిక వేడి పుంజుకుంది.

టీఆర్ఎస్ నుంచి ఈసారి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ పోటీ పడుతున్నారు. ప్రధానంగా పోటీ ఈ ముగ్గురి మధ్యే ఉంది. ఈసారి సాగర్ ఉప ఎన్నికలో 86.1శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20వేల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ కే ఎడ్జ్ చూపించినప్పటికీ, జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంటున్నారు. సాయంత్రంం 4 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.