బ్యాంకర్ల దందాలకు ప్రభుత్వం ముకుతాడు!

స్వయం ఉపాధి కింద రుణం పొందదలచుకున్న ఒక వ్యక్తికి ప్రభుత్వం చేయూత అందిస్తున్నది అనుకుందాం. ఇలాంటి వారు ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనార్టీ వర్గాలకు చెందిన వారైతే వారికి.. ప్రభుత్వం వివిధ రకాలుగా…

స్వయం ఉపాధి కింద రుణం పొందదలచుకున్న ఒక వ్యక్తికి ప్రభుత్వం చేయూత అందిస్తున్నది అనుకుందాం. ఇలాంటి వారు ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనార్టీ వర్గాలకు చెందిన వారైతే వారికి.. ప్రభుత్వం వివిధ రకాలుగా రాయితీలను కూడా అందిస్తుంది. వారి కేటగిరీలను బట్టి రాయితీల మొత్తం ఉంటుంది. ఆ రాయితీలకు తోడు, బ్యాంకర్లు అందించే రుణాలతో లబ్ధి దారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకోవాలి.

అయితే ఈ క్రమంలో బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, దందాలు సాగించడం, అనేకమందికి తిరస్కరించడం మామూలైపోయింది. దీంతో లబ్ధిదారుల బాగుకోసం ఆశించిన ప్రయోజనం జరగడం లేదు. జగన్ ప్రభుత్వం బ్యాంకర్ల దందాలకు చెక్ పెడుతూ.. కొత్త నిర్ణయం తీసుకుంది. జాప్యం గానీ, బ్యాంకర్ల దయాదాక్షిణ్యాల అవసరం గానీ లేకుండా నేరుగా లబ్ధిదారులకే సొమ్ములిచ్చేసే ఆలోచన చేస్తోంది. ఇలాంటి మంచి ఆలోచనపై కూడా పచ్చ మీడియా కుట్రలు చేస్తుండడం గమనార్హం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్లు లబ్ధిదారులు రుణాలు పొందడానికి రాయితీలు మంజూరు చేస్తాయి. రాయితీ సొమ్ము విడుదల అయిన తర్వాత కూడా.. బ్యాంకులు వాటిని తమ వద్దనే ఉంచుకుంటూ.. లబ్ధిదారులకు రుణాలను ఒక పట్టాన మంజూరు చేయడం లేదు. అనేకానేక నిబంధనల పేరిట వారిని సతాయిస్తున్నారు. పూచీకత్తు అనేది అతిపెద్ద ప్రహసనంగా మారుస్తున్నారు. దీంతో ఏటా యాభై శాతం యూనిట్లు మాత్రమే గ్రౌండ్ అవుతుండగా.. ప్రభుత్వపు రాయితీ సొమ్ములు మాత్రం బ్యాంకుల్లో మూలిగే పరిస్థితి నెలకొంది.

ఈ దందాలు ఇలా కొనసాగకుండా ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నది. బ్యాంకుల ద్వారా రుణాల జోలికి వెళ్లకుండా.. లబ్ధిదారులకు తాము ఇవ్వదలచుకున్న మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలకే ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల లబ్ధిదారుడు బ్యాంకుల చుట్టూ తిరిగే భారం తగ్గుతుంది. బ్యాంకు నిబంధనలు, అడిగిన పూచీకత్తు చూపగలిగిన వారు.. ప్రభుత్వం ఇచ్చే రాయితీ సొమ్ముతో పాటు రుణం కూడా తీసుకోవచ్చు. లేదా రాయితీ సొమ్ముకు ఇతరత్రా తాము సమకూర్చుకున్న నిధులను కలిపి యూనిట్ ప్రారంభించవచ్చు.

దీనివల్ల జాప్యం లేకుండా.. ప్రతి ఏటా ఎక్కువ మంది ప్రభుత్వం అందించే ఆసరాను వినియోగించుకోవడానికి వీలవుతుంది. రాయితీ బ్యాంకు రుణాల రూపేణా వెళ్లడం వలన.. బ్యాంకులు బాగుపడుతున్నాయి తప్ప.. ఆశించిన స్థాయిలో పేదలకు న్యాయం జరగడం లేదనే అభిప్రాయంతోనే ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇంటి ప‌నుల‌తో పాటు బాడీ మసాజ్ లు చేయిచుకుంటున్న యాంక‌ర్‌ ?

అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నపుడే ప్రొడ్యూసర్స్ పై కంప్లైంట్ ఇచ్చేవాడు