ఇది కదా చెప్పాల్సిన వార్త ?

కరోనా ఎక్కడ ఉంది అంటే మీడియాలో నిండా ఉంది. పుంఖానుపుంఖాలుగా భయంకరమైన కధనాలు ప్రసారం చేస్తూ జనాలను ఒక్క లెక్కన హడలుకొడుతున్నారు అన్న విమర్శలు ఇప్పటికే వచ్చేశాయి. Advertisement ఈ దేశంలో లక్షల కేసులు…

కరోనా ఎక్కడ ఉంది అంటే మీడియాలో నిండా ఉంది. పుంఖానుపుంఖాలుగా భయంకరమైన కధనాలు ప్రసారం చేస్తూ జనాలను ఒక్క లెక్కన హడలుకొడుతున్నారు అన్న విమర్శలు ఇప్పటికే వచ్చేశాయి.

ఈ దేశంలో లక్షల కేసులు నమోదు అవుతున్నాయని చెప్పడం వరకే బాధ్యత తీసుకునే మీడియా ప్రతీ రోజూ లక్షలలో కరోనా నుంచి కోలుకుంటూ ఇళ్ళకు వెళ్తున్న‌ వారి వివరాలను మాత్రం చెప్పకపోవడం వల్లనే జనాల్లో భయం పెరిగిపోతోంది అన్నది వైద్య నిపుణుల భావన.

ఇక విషయానికి వస్తే విశాఖలో ప్రతీ రోజూ వేయికి తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా నుంచి రికవరీ అయి ఇళ్లకు చేరుకుంటున్న వారి జాబితా కూడా ఎక్కువగానే ఉంటోంది. 

విశాఖలోని ప్రధాన ఆసుపత్రులో పెద్ద సంఖ్యలో కరోనా రోగులు ఆరోగ్యవంతులు అయి ప్రతీ రోజూ బయటకు వస్తున్నారు. వారంతా తాము మహమ్మారి మీద విజయం సాధించామని కూడా చెబుతున్నారు.

మొత్తానికి కరోనా విష పురుగుతో మనిషి అన్నవాడు ఇక భూమి మీద ఉండడు అన్నట్లుగా రాతలు రాస్తున్న వారు అపుడపుడు రికవరీ అవుతున్న వారి విషయాలు కూడా రాస్తే ఇంతలా జనాలు పానిక్ అయిపోయే స్థితి ఉండదు అని వైద్య నిపుణులు అంటున్నారు. 

నిజానికి కరోనా కంటే ముందు చంపేసేది భయమే అని కూడా వారు చెబుతున్నారు. విశాఖ మాత్రమే కాదు ఏపీలోనూ దేశంలోనూ రికవరీలు ప్రతి రోజూ పెరగడం శుభ పరిణామమే.