2020 సమ్మర్ కు రావాల్సిన సినిమా.
2021 సంక్రాంతికి వస్తుందనుకునన్న సినిమా.
2021 దసరా పోస్ట్ సమ్మర్ లేదా దసరా టైమ్ కు ఫిక్స్ అయిందనుకున్న సినిమా.
ఇప్పుడు 2022 సమ్మర్ అని వినిపించడం ప్రారంభమైంది
రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ సినిమా సంగతే ఇది. అత్యంత భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఆర్ఆర్ఆర్ విడుదల ఇప్పట్లో వుండదని, 2022 సమ్మర్ కు వెళ్లిపోతుందని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
కరోనా రెండో దశ బలంగా వ్యాపించడంతో పరిస్థితులు అన్నీ తారుమారు అయ్యాయి. దేశంలోని ఏ ప్రాంతం కూడా సజావుగా లేదు. మరో నెల దాటితే తప్ప షూటింగ్ ల పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు. పోనీ నెల దాటిన తరువాత షూటింగ్ లు మొదలైనా ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది లో విడుదలకు వీలు అవుతుందా అన్నది అనుమానంగా వుంది.
అందువల్ల సంక్రాంతిని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఈఅనుమానం వుండబడ్డే, ఎందుకయినా మంచిది అని 2022 సంక్రాంతికి షెడ్యూలు చేసుకున్న సినిమాలు ఓ నెల ముందుగా రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి కూడా.
కానీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నదాన్ని బట్టి 2022 సమ్మర్ కే ఆర్ఆర్ఆర్ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.