సినిమాల్లో కోరి ప్రత్యేక మైన పాత్రలు సృజించడం పెరిగింది. హీరోలు, నటులు కూడా ఇలాంటి పాత్రలను ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలాంటి పాత్రలు చేసి ప్రూవ్ చేసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాలో మురళీశర్మ కాలు అవిటిగా వుండే పాత్ర ను శహభాష్ అనేలా చేసి చూపించారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావురమేష్ కూడా ఇలాంటి పాత్రను చేయబోతున్నారు. మంచి నటుడు అయిన రావు రమేష్ ఓ గూని వాడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత దర్శకుడు అజయ్ భూపతి అందిస్తున్న మహా సముద్రంలో ఈ క్యారెక్టర్ వుంటుంది.
శర్వానంద్, సిద్దార్ధ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర కూడా కీలకంగా వుంటుందట. గూని వాడిగా రావు రమేష్ ఎలా కనిపించబోతున్నారో? ఎలా నటించబోతున్నారో అన్నది కాస్త ఆసక్తి కరమే.