త్రివిక్రమ్ మళ్లీ మరో అతడు

సూపర్ స్టార్ మహేష్ బాబు-టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయడం దాదాపు కన్ ఫర్మ్ అయిపోయింది. అయితే ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా రాబోతోంది? అతడు మాదిరిగానా?  Advertisement ఖలేజా టైపులోనా?…

సూపర్ స్టార్ మహేష్ బాబు-టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయడం దాదాపు కన్ ఫర్మ్ అయిపోయింది. అయితే ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా రాబోతోంది? అతడు మాదిరిగానా? 

ఖలేజా టైపులోనా? ఖలేజాలో కథ కన్నా కామెడీ ఎక్కువ వుంటుంది. అతడు లో అటు ఫ్యామిలీ ఎమోషన్లు, ఎంటర్ టైన్ మెంట్, ప్లస్ యాక్షన్ కూడా వుంటుంది. 

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ చేయబోతున్న మహేష్ బాబు సినిమా అతడు టైపులోనే వుంటుందని తెలుస్తోంది. 

ఫన్..ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు యాక్షన్ కలిసిన కథను తయారుచేసే పనిలో తివిక్రమ్ వున్నారు. త్రివిక్రమ్ దగ్గర కేజిఎఫ్ టైపు కథ, పాన్ ఇండియాకు సరిపోయే కథలు వున్నాయి. 

మాంచి లవ్ స్టోరీ వుంది. అలాగే ఫ్యామిలీ కథ వుంది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రెష్ గా మహేష్ కోసం వేరే కథ తయారుచేస్తున్నారు.