ఆ ముచ్చట కూడా చెప్పేసిన వెంకటేష్

ఒకానొక టైమ్ లో విడుదల తేదీలు చెప్పడానికి ఎగబడ్డాయి సినిమాలన్నీ. పోటీ పడి మరీ రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే పోటీ కనిపిస్తోంది. కాకపోతే ఈసారి విడుదలలు వాయిదా పడ్డాయని…

ఒకానొక టైమ్ లో విడుదల తేదీలు చెప్పడానికి ఎగబడ్డాయి సినిమాలన్నీ. పోటీ పడి మరీ రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే పోటీ కనిపిస్తోంది. కాకపోతే ఈసారి విడుదలలు వాయిదా పడ్డాయని చెప్పడానికి ఒక్కో యూనిట్ ముందుకొస్తోంది.

సెకెండ్ వేవ్ తో మరోసారి సినిమా షూటింగ్స్, రిలీజెస్ ఆగిపోవడంతో ఈ మేరకు లవ్ స్టోరీ, ఆచార్య, టక్ జగదీశ్ లాంటి సినిమా యూనిట్స్ తమ సినిమాలు పోస్ట్ అయిన విషయాన్ని అధికారికంగా చెప్పేశాయి. ఇప్పుడా లాంఛనాన్ని వెంకటేష్ కూడా పూర్తిచేశాడు.

“నారప్ప చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు, ప్రేక్షకులకు మనవి. ప్రస్తుత పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకొని చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.”

ఈ ఏడాది వెంకీ నుంచి 3 సినిమాలొస్తాయని అంతా ఆశించారు. ముందుగా నారప్ప రిలీజై, ఆ తర్వాత కొన్నాళ్లకు దృశ్యం-2, ఎఫ్3 సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తాయని అనుకున్నారు. కానీ కరోనా కల్లోలంతో ఈ ఏడాది వెంకటేష్ నుంచి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్.