చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలు కూడా టీవీల్లో ఫెయిల్ అయిన దాఖలాలున్నాయి. సైరా, సాహో, వినయ విధేయ రామ లాంటి సినిమాలకు పెద్దగా టీఆర్పీలు రాలేదు. అలాంటిది వైష్ణవ్ తేజ్ సినిమాకు అదిరిపోయే రేటింగ్ వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా, స్మాల్ స్క్రీన్ పై కూడా సూపర్ హిట్టయింది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఉప్పెన సినిమాకు ఏకంగా 18 టీఆర్పీ రావడం విశేషం. ఈమధ్య కాలంలో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత అత్యథిక రేటింగ్ ఇదే. రవితేజ నటించిన క్రాక్ సినిమా టీఆర్పీ (11.66)ని కూడా ఉప్పెన క్రాస్ చేసింది.
వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. కంటెంట్ పరంగా ఈ సినిమా బుల్లితెర వీక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వదని చాలామంది భావించారు. కానీ ఆ అంచనాలు తప్పని నిరూపించింది ఉప్పెన. మరీ ముఖ్యంగా పాటలు సూపర్ హిట్ అవ్వడంతో టీవీ ఆడియన్స్ కూడా దీనికి కనెక్ట్ అయ్యారు.
ఉప్పెనతో పాటు అదే రోజు విజయ్ నటించిన మాస్టర్ సినిమాను కూడా ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. ఈ సినిమాకు 4.86 రేటింగ్ వచ్చింది.