భీష్మ వేడుకకు మెగా హీరో

వెంకీ కుడుముల డైరక్షన్ లో నితిన్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిస సినిమా భీష్మ. మంచి హిట్ గా అప్లాజ్ అందుకున్న ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ఫంక్షన్…

వెంకీ కుడుముల డైరక్షన్ లో నితిన్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిస సినిమా భీష్మ. మంచి హిట్ గా అప్లాజ్ అందుకున్న ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దర్శకుడు త్రివిక్రమ్ గెస్ఠ్. ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఫంక్షన్ కు మెగా హీరో వరుణ్ తేజ్ గెస్ట్ గా రాబోతున్నాడు.

ఈ మధ్య విశాఖలో జరుగుతున్న ప్రతి వేడుక సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు యంగ్ హీరోలు ఓ వేదిక మీదకు రావడం అంటే జనాలు భారీగానా హాజరయ్యే అవకాశం వుంది.

ఈనెల 29 విశాఖలో  'గురజాడ కళాకేత్రం' లో 'భీష్మ' చిత్ర విజయోత్సవ వేడుక ను నిర్వహించ నున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. హీరో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన 'భీష్మ' వేడుకను, ఇంతటి ఘన విజయాన్ని తమకు అందించిన ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  నాయిక రష్మిక మందన్న లతోపాటు చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు.

జగన్ గారు చాల కైండ్ పర్సన్