కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పుట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అయితే అలాంటి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత కథ రెండు భాగాలుగా ముస్తాబు అవుతోంది. మరి పార్టీ వైఖరి మారినందున ఆ సినిమా రెండోభాగంలో డైలాగులు, వ్యవహారాలు మార్చాల్సి వస్తుందేమో అని అనుమానాలు వినిపించడం ప్రారంభమైంది. అదేవిధంగా అసలు రెండోభాగం ఇప్పుడు విడుదల చేయకుండా, ఎన్నికల తరువాత విడుదల చేస్తారనే మాటలు కూడా వినిపించాయి.
కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, చాలా చిన్నమార్పుతో, ఈ సమస్యను దర్శకుడు క్రిష్ అధిగమించేసినట్లు తెలుస్తోంది. పోరాటం, ఇందిర ఫ్యామిలీతో కాదు. ఢిల్లీతో. అప్పుడు అయినా, ఇప్పుడు అయినా ఢిల్లీ పెత్తనం మీద పోరాట తప్ప, వ్యక్తుల మీద, కుటుంబాల మీద కాదు. అన్నది లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ ప్రచారంలోకి తేబోతున్న అంశం.
ఇదే ప్రాతిపదికగా బయోపిక్ లో డైలాగుల్లో వెరీ వెరీ స్మాల్ చేంజెస్ చేస్తే సరిపోతుందని డిసైడ్ అయ్యారట. అందువల్ల రెండు భాగాలు కూడా జనవరి నెలలోనే విడుదల చేస్తారన్నమాట. ప్లాన్ మారదు, డేట్ మారదు. రీషూట్ లు వుండవు. జస్ట్ ఇందిర ఫ్యామిలీపై, కాంగ్రెస్ పై పోరు అని కాకుండా, ఢిల్లీ పెత్తనం ఇంకానా? ఇకపై చెల్లదు అనే పోరుగా స్మాల్ ఛేంజ్ అన్నమాట.
అప్పుడూ ఎన్టీఆర్ చేసింది ఢిల్లీపై పోరునే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఢిల్లీ పై పోరునే. అప్పుడు ఇప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఢిల్లీనే, పెత్తనం చేసింది ఢిల్లీనే. కాంగ్రెస్, భాజపా అన్నవి కాదు. అదన్నమాట సంగతి.
నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్