Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అప్పుడే మా సినిమా టీవీలో ప్రసారం చేయొద్దు

అప్పుడే మా సినిమా టీవీలో ప్రసారం చేయొద్దు

లేకలేక హిట్ కొట్టింది త్రిష. ఆమె నటించిన 96 అనే తమిళ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ఐదో వారంలోకి ఎంటరైంది. అయితే ఇప్పుడీ సినిమా త్వరలోనే టీవీలో ప్రసారం కాబోతోంది. దీంతో త్రిషకు కోపం వచ్చేసింది.

అవును.. సన్ టీవీలో ఈ దీపావళి కానుకగా 96 సినిమాను ప్రసారం చేయబోతున్నారు. అప్పుడే అక్కడ ప్రోమోలు కూడా ప్రారంభమైపోయాయి. ఓవైపు తను సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంటే, మరోవైపు ఇలా ఈ సినిమాను అప్పుడే టీవీల్లో ప్రసారానికి సిద్ధం చేయడాన్ని త్రిష తట్టుకోలేకపోయింది.

"మా సినిమా ఐదోవారంలోకి ఎంటరైంది. ఇప్పటికీ థియేటర్లలో 80శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. ఇంత తొందరగా 96 సినిమాను టీవీల్లో వేయడం మంచిదికాదు. దయచేసి సినిమాను సంక్రాంతికి వేయాల్సిందిగా సన్ యాజమాన్యాన్ని కోరుతున్నాం."

ఇలా ట్విట్టర్ లో తన వ్యతిరేకతను తెలియజేసింది త్రిష. ఇంతవరకు బాగానే ఉంది కానీ బ్యాన్ 96 మూవీ ప్రీమియర్ ఆన్ సన్ టీవీ అంటూ త్రిష ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసింది. అదికాస్తా బాగా ట్రెండ్ అవ్వడంతో సన్ యాజమాన్యానికి కోపం తెప్పించింది.

నిజానికి ఈ సినిమాను ఎన్ని రోజులకు టీవీల్లో ప్రసారం చేయాలనే విషయంపై శాటిలైట్ రైట్స్ అగ్రిమెంట్ లోనే క్లియర్ గా రాసి ఉంటుంది. రిలీజైన నెల రోజులకే సినిమాను ప్రసారం చేసుకోవచ్చంటూ నిర్మాతలు, సదరు ఛానెల్ కు రాసిచ్చేశారు.

కాబట్టి సర్వహక్కులు సన్ టీవీకి ఉంటాయి. కానీ త్రిష కోరిక మేరకు ఈ విజ్ఞప్తిని పరిశీలిద్దామంటే, ఆమె క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ఛానెల్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

ఆత్మ గౌరవమా తోటకూర కట్టా.. కాంగ్రెస్ తరపున కొత్త దళారీ చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?