Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

2.0లో కథను మలుపుతిప్పేది అదేనా?

2.0లో కథను మలుపుతిప్పేది అదేనా?

మానవ శక్తితో మానవాతీత శక్తి జరిపే పోరాటమే రోబో. ఇలాంటి కథల్లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే భావోద్వేగాలకు, రోమాలు నిక్కబొడుచుకునే సస్పెన్స్ సన్నివేశాలకూ చోటెక్కువ. కానీ శంకర్ ఈసారి తీస్తున్న కథ వేరే. మానవాతీత శక్తితో మరో మానవాతీత శక్తి జరిపే పోరాటం. అంటే అన్నీ ఊహలకు అతీతంగానే ఉంటాయి. భావోద్వేగాల పాళ్లు కాస్త తక్కువ. 

కానీ దర్శకుడు శంకర్ ని తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. 2.0లో కూడా అంతర్లీనంగా సామాన్య మానవులు కనెక్ట్ అయ్యే సెల్ ఫోన్ కథాంశాన్ని తీసుకున్నాడు, ఇక దాన్ని తనదైన శైలిలో తెరకెక్కించాడు. 2.0 టీజర్ కీ, ట్రైలర్ కీ పెద్ద తేడా లేకపోయినా ఈసారి శంకర్ మైండ్ గేమ్ మాత్రం బైటపడింది. 

మనిషిని ప్రేమించిన మరమనిషి భావోద్వేగాలే రోబోకి హైలెట్. అలాంటి అంశాలే రోబో 2.0 లో కూడా కనిపిస్తాయి. టీజర్ క్లైమాక్స్ లో రోబో రజనీతో తలపడే అక్షయ్ కుమార్ సీన్ ని జాగ్రత్తగా గమనిస్తే.. అందులో మరో రజినీ ఫేస్ ఉంటుంది. రోబోని ఎదుర్కోడానికి విలన్ అక్షయ్ రజనీకాంత్ రూపంలోకి మారిపోయి మైండ్ గేమ్ ఆడతాడనమాట. సినిమాకు టర్నింగ్ పాయింట్ ఇదే అనే చర్చ కోలీవుడ్ లో జోరుగా సాగుతోంది.

అప్పటివరకూ పక్షిరాజుపై పైచేయి సాధించిన చిట్టీ.. రజనీ రూపంలోకి మారిన తన ప్రత్యర్థిని గుర్తు పట్టలేకుండా కథ సాగుతుందన్నమాట. ప్రీ క్లైమాక్స్ నుంచి మొదలయ్యే ఈ సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాకి ప్రధానాకర్షణ అని తెలుస్తోంది. రోబో సినిమాలో రజనీ వర్సెస్ రజనీ సన్నివేశాలు ఎంతగా ఆకట్టుకున్నాయో.. 2.0లో కూడా ఇదే తరహా సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటాయట. 

సెంటిమెంట్ ప్రకారం చూస్తే షూటింగ్ మొదలైనప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న 2.0 లాంటి సినిమాలకి సక్సెస్ రేట్ తక్కువ. ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కానీ 2.0 విషయంలో మాత్రం అలా జరగదని అంచనా వేస్తున్నారు.

ఆత్మ గౌరవమా తోటకూర కట్టా.. కాంగ్రెస్ తరపున కొత్త దళారీ చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

2.0 ట్రయిలర్ లాంచ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?