తెలుగులోకి మళ్లీ మాధవన్

సవ్యసాచి సినిమా ఫలితం ఎలా వున్నా, చాన్నాళ్ల తరువాత తెలుగువారికి మాధవన్ ను గుర్తుచేసింది. మాధవన్ నటనను జస్ట్ అలా మరోసారి రుచి చూపించింది. మాధవన్ ను మంచి రెమ్యూనిరేషన్ తో నిర్మాతలు తేగలిగారు…

సవ్యసాచి సినిమా ఫలితం ఎలా వున్నా, చాన్నాళ్ల తరువాత తెలుగువారికి మాధవన్ ను గుర్తుచేసింది. మాధవన్ నటనను జస్ట్ అలా మరోసారి రుచి చూపించింది. మాధవన్ ను మంచి రెమ్యూనిరేషన్ తో నిర్మాతలు తేగలిగారు కానీ, హీరో వర్షిప్ ఇండస్ట్రీ కావడంతో డైరక్టర్ చందు మాత్రం అతనికి సరైన పాత్రను మాత్రం తయారు చేయలేకపోయాడు. అదంతా వేరే సంగతి.

ఇదిలా వుంటే మాధవన్ నటనను మళ్లీ పూర్తిగా తెలుగులో చూసే అవకాశం వస్తున్నట్లే వుంది. అతగాడు తమిళంలో చేసిన విక్రమ్ వేధ సినిమాను ఇప్పుడు తెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే డబ్బింగ్ రూపంలో కాదు. రీమేక్ చేసే ఆలోచన.

డిఫరెంట్ స్టోరీతో, మాధవన్ అద్భుత పెర్ ఫార్మెన్స్ తో కూడిన సినిమా విక్రమ్ వేథ. ఈ సినిమా తమిళనాట పెద్ద హిట్. రీమేక్ హక్కులు కానీ డబ్బింగ్ రైట్స్ ను కానీ విక్రమ్ వేధా నిర్మాతలు అయిన వైనాట్స్ సంస్థ  ఇవ్వలేదు. ఇప్పుడు నేరుగా తెలుగులో తామే నిర్మించే ఆలోచన చేస్తున్నారట.

తమిళంలో ఈ సినిమాను రూపొందించింది పుష్కర్-గాయత్రి అనే భార్యభర్తలు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాను చేసే అవకాశం దర్శకుడు సుధీర్ వర్మకు దక్కుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న శర్వానంద్ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

మెయిన్ క్యారెక్టర్ గా మాధవన్ నే వుంటాడు. అలాగే విజయ్ సేతుపతి కూడా తెలుగువారికి బాగానే పరిచయం అయిపోయాడు కాబట్టి, వుంచుతారో? మార్చుతారో చూడాలి. ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజ్ లోనే వుంది సినిమా.

నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్