Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్లాసిక్ ఆవారా.. దేవ్

క్లాసిక్ ఆవారా.. దేవ్

కార్తీ లేటెస్ట్ సినిమా దేవ్ టీజర్ బయటకు వచ్చింది. ఓ మాస్ కుర్రాడు రోడ్ మూవీ చేస్తే ఎలా వుంటుందో ఆవారా అలా వుంటుంది. కార్తీ సినిమాల్లో పెద్ద హిట్ ఆ మూవీ. దేవ్ టీజర్ చూస్తుంటే ఆవారా గుర్తుకు వస్తుంది.

క్లాస్ టచ్ రోడ్ మూవీ మాదిరిగా కనిపిస్తోంది. ఉరకలు, పరుగులే జీవితం అయిపోయిన ఈ కార్పొరేట్ మాయాజాల ప్రపంచంలో, అసలు జీవితాన్ని జీవించడమే మరిచిపోయిన రోజుల్లో, ఓ కుర్రాడు తీసుకున్న నిర్ణయం, ఆ వైనం, ఆ పర్యవసానాలు కలిసి దేవ్ సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తోంది.

కార్తీ ఈ మధ్యనే చినబాబు అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అందించాడు. ఈసారి పక్కా స్టయిలిష్, అల్ట్రా అర్బన్ బేస్డ్ సినిమా అందిస్తున్నట్లు కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. కార్తీ, రకుల్ ప్రీత్ కెమిస్ట్రీ ఆ మధ్య వచ్చిన ఖాకీ సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమా తరువాత మళ్లీ ఇద్దరు లీడ్ పెయిర్ గా నటిస్తున్న సినిమా దేవ్.

డిసెంబర్ నెలాఖరులో లేదా జనవరిలో విడుదల లక్ష్యంగా తయారవుతోందీ సినిమా. తెలుగులో నిర్మాత టాగోర్ మధు తన లైట్ హవుస్ పతాకంపై అందిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?