ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ చేతిలో పడిన తరువాత కాస్త గాడిలో పడినట్లు అనిపించింది. ఒక్కో యాక్టర్ ను పరిచయం చేస్తూ, ఒక్కో పాత్రను వదలుతూ వుంటే, మాంచి లుక వస్తోంది బయోపిక్ కు అన్న టాక్ రావడం, దానికి తగ్గట్లు నాన్ బాహుబలి రేట్లకు అమ్ముడుపోతుండడంతో అహా ఎన్టీఆర్ బయోపిక్ అని వినిపించింది. అనిపించింది.
కానీ ఇప్పుడు ఇండస్టీ వర్గాల నుంచి వస్తున్న గ్యాసిప్ లు వింటుంటే, అయ్యవారికి చేయబోతే కోతి బొమ్మ తయారవుతున్నట్లు, బాలయ్య స్వంత ఇంట్రస్ట్ లు ఒక్కోటీ చొప్పిస్తూ రావడంతో సినిమా ఏదోగా తయారవుతోందని అనిపిస్తోంది. సినిమా వ్యవహారాలు, ఎన్టీఆర్ జీవిత వ్యవహారాలు సమతూకంగా వుండాలని క్రిష్ అనుకున్నారట. కానీ రాను రాను సినిమా వ్యవహారాలే డామినేట్ చేసేస్తున్నాయని వినిపిస్తోంది.
లేటెస్ట్ గా సర్దార్ పాపారాయడులోని సీతారామరాజు టైపు గెటప్, వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జోడిస్తే, ఇప్పుడు కొత్తగా బొబ్బిలి పులిలోని కోర్టు సీన్ జోడిస్తున్నారట. అంటే పాటలో శ్రీదేవి గెటప్ లో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇక, కోర్టు సీన్ లో నటించి ఎలాంటి కామెంట్లు తెచ్చుకుంటుందో చూడాలి. ఈ మేరకు సారథి స్టూడియోలో కోర్టు సెట్ కూడా వేసారట.
ఇవి చాలదన్నట్లు మయసభ సెట్, దుర్యోధనుడిగా బాలయ్య వీర అభినవేశం వుండనే వుంటాయట. ఇలా బాలయ్యకు అయిడియా రావడం, ఆస్థాన రచయితలు జోడించుకుంటూ పోవడం, క్రిష్ చేసుకుంటూ వెళ్లడం జరుగుతోందంటున్నారు.
ఇలా అన్నీ సినిమాల అతుకుల ముక్కల మాదిరిగా బయోపిక్ వుంటే చూడడం కష్టం. ఎన్టీఆర్ పాటల రికార్డింగ్ డ్యాన్స్ స్టేజీ మీద చూసినట్లు వుంటుందేమో?
నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్