వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చరణ్

మొత్తానికి బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లోని వినయ విధేయ రామ సినిమా ఫస్ట్ లుక్ రాబోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా విషయంలో ఏ ఒక్కటీ బయటకు ఇవ్వలేదు. రేపు తొలిసారి టైటిల్ తో…

మొత్తానికి బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లోని వినయ విధేయ రామ సినిమా ఫస్ట్ లుక్ రాబోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా విషయంలో ఏ ఒక్కటీ బయటకు ఇవ్వలేదు. రేపు తొలిసారి టైటిల్ తో ఫస్ట్ లుక్ రెడీ చేసారు. ఈ వార్త లీక్ అయిందని మార్చేస్తే, చెప్పలేము కానీ, ఇప్పటికి ఫైనల్ చేసిన ఫస్ట్ లుక్ లో మాత్రం హీరో రామ్ చరణ్ పూర్తిగా తెల్లటి డ్రెస్ లో కనిపించబోతున్నాడు. అది కూడా పంచెకట్టులో.

తెల్లటి పంచె, తెల్లటి లాల్చీతో, పూర్తి తెలుగుదనంతో వున్న గెటప్ లో వున్న రామ్ చరణ్ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా చూపించబోతున్నారన్న మాట. సాధారణంగా రామ్ చరణ్ ఎక్కువగా బ్లాక్ డ్రెస్ ల్లో కనిపిస్తాడు. ఆయన తరచు స్వామి మాల వేస్తారు కాబట్టి ఆ డ్రెస్ లో చూడడమే ఎక్కువ. అందువల్ల వైట్ అండ్ వైట్ అంటే కాస్త ఆసక్తికరమే.

ఫస్ట్ లుక్ ఈనెల 6న వస్తే, 9న టీజర్ రాబోతోంది. మరి టీజర్ ఎలా వుంటుందో చూడాలి. ఈ రెండూ బయటకు వస్తేచాలు, ఇన్నాళ్లుగా ఈ సినిమా పబ్లిసిటీని దర్శకుడు బోయపాటి దూరంగా పెట్టారు అన్న అభిమానుల అసంతృప్తి దూరం అయిపోతుంది.

సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ కు రెండురోజులు దూరంగా విడుదలవుతోంది ఈ సినిమా. బాలయ్య అంటే బోలెడు ఇష్టంవున్న బోయపాటి సినిమా, అదే బాలయ్య సినిమాకు పోటీగా రావడం విశేషం.

నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్