త్రివిక్రమ్ కు నో ఆప్షన్.. అందుకే అలా?

త్రివిక్రమ్-బన్నీ సినిమా అనౌన్స్ మెంట్ ఇదిగో అదిగో అంటూ వెనక్కు వెళ్తోంది. సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వ్యవహారం తేలకపోవడం వల్లనే ఈ సమస్య అంతా. టీ సిరీస్ కు అయితే భాగస్వామ్యం ఇచ్చేది లేదని…

త్రివిక్రమ్-బన్నీ సినిమా అనౌన్స్ మెంట్ ఇదిగో అదిగో అంటూ వెనక్కు వెళ్తోంది. సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వ్యవహారం తేలకపోవడం వల్లనే ఈ సమస్య అంతా. టీ సిరీస్ కు అయితే భాగస్వామ్యం ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసినట్లు బోగట్టా. కావాలంటే ఎంతోకొంత హక్కులకు అని ఇస్తాం అని, లేదంటే వేరే చేసుకుంటామని చెప్పేసినట్లు తెలుస్తోంది.

ఇక మిగిలింది గీతా, హారిక హాసిని బ్యానర్లు, హీరో బన్నీ అయితే సినిమాను సోలోగా గీతా సంస్థకే చేసే ఉద్దేశంలో వున్నట్లు తెలుస్తోంది. హారిక హాసినికి భాగస్వామ్యం ఇవ్వడానికి అంత సుముఖంగా లేనట్లు బోగట్టా. కానీ త్రివిక్రమ్ మాత్రం తనవంతు ప్రయత్నం ఇంకా తాను చేస్తున్నారు. త్రివిక్రమ్ మీద భరోసా వేసి హారిక జనాలు సైలెంట్ గా వున్నారు.

త్రివిక్రమ్ కూడా గట్టిగా పట్టుపట్టడానికి వీలు లేని పరిస్థితి. మరో హీరో ఎవ్వరూ అందుబాటులో లేరు. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ఇలా ఎవ్వరూ లేరు. చేస్తే ఇక మిడిల్ రేంజ్ హీరోలతో చేయాలి. అవసరం అయితే అలాగే చేద్దామని అంటున్నారని కూడా వినిపిస్తోంది.

అయితే బన్నీ సినిమా వైపే మొగ్గు వుందని, వీలయినంత వరకు కనీసం బ్యానర్ యాడ్ చేసి, ఎంతోకొంత వాటా హారికకు ఇప్పించేందుకు ప్రయత్నం మాత్రం ఆపలేదని తెలుస్తోంది. అటు బన్నీ కూడా తన పట్టుమీదే వున్నారని తెలుస్తోంది.

గీతాకు సోలోగా సరైన సినిమా చేయాలని అతని ప్లాన్. మరి ఎవరి పంతం నెగ్గుతుందో? ఒక పక్క అరవింద బయ్యర్లు లాస్ అయిపోయారని వార్తలు వినవస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ కు ఇంకా బేరం ఆడే శక్తి వుంటుందా? చూడాలి.

కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్