విజయ్ దేవరకొండ హీరోగా జిఎ 2 బ్యానర్(బన్నీవాస్), యువి (వంశీ) కలిసి నిర్మించిన చిత్రం టాక్సీవాలా. ఈ ప్రాజెక్టుకు తెరవెనుక సూత్ర ధారి దర్శకుడు మారుతి. ఇలా ముగ్గురు 'మహానుభావులు' కలిసి నిర్మించిన ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా రఫ్ ఫుటేజ్ మొత్తం టోటల్ గా బయటకు వెళ్లిపోయింది. ఫోన్ లలో తిరిగేస్తోంది.
అయితే సిజి వర్క్, డిఐ, డిటిఎస్, క్లారిటీ లేని ప్రింట్ కాబట్టి సమస్య లేదు. ఈ సినిమా నిర్మాణానికి జస్ట్ నాలుగున్నర కోట్లు మాత్రమే ఖర్చయింది. పబ్లిసిటీకి మరో రెండుకోట్లు. అయితే చాలా ఎర్లీ స్టేజ్ లో అంటే పెళ్లిచూపులు విడుదలయిన కొత్తలో అనుకున్న ప్రాజెక్టు. అప్పట్లోనే డిజిటల్, శాటిలైట్, హిందీ అన్నీ కలిపి రెండుకోట్ల పాతిక లక్షలకు ఇచ్చేసారు.
అందువల్ల ఇప్పుడు టోటల్ గా థియేటర్ రికవరీ జస్ట్ నాలుగు కోట్లు మాత్రమే. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ లో వచ్చేయగల మొత్తమే. అయితే ఇటీవల నోటా ఫలితం ఒకటి మాత్రం కలవరపెడుతోంది. తొలిరోజు ఓపెనింగ్స్ బాగుండి, పాజిటివ్ టాక్ వస్తే, మూడోరోజు అక్కరలేదు. రెండురోజులు చాలు నాలుగు కోట్లు రాబట్టడానికి. లేదూ అన్నా వచ్చిన నష్టంలేదు.
యువి, గీతా చాలా జాగ్రత్తగా థియేటర్లు ఎంచి విడుదల చేస్తారు. పైసా పైసా జాగ్రత్తగా వసూలు చేస్తారు. అందువల్ల పెద్దగా సమస్య లేకపోవచ్చు.
కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్