ఏదైనా ఎక్కువా పనికిరాదు. అలా అని తక్కువా పనికిరాదు. శ్రీనివాస కళ్యాణం సినిమా మీద నిర్మాత దిల్ రాజు భయంకరమైన హోప్స్ పెట్టుకున్నారు. దానికి చేసిన ప్రచారం, చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. కానీ ఆ సినిమా జనాలకు నచ్చలేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. అది దిల్ రాజును బాగా అప్ సెట్ చేసింది. ఆ ప్రభావం తరువాత సినిమా హలోగురూ ప్రేమకోసమే మీద బాగా కనిపించింది.
హలోగురూ ప్రేమకోసమే సినిమాకు విడుదలకు ముందు కాస్త హఢావుడి చేసారు. సినిమాలో బజ్ తోనే విడుదలయింది. మిక్స్ డ్ టాక్ వచ్చినా, జనం బాగానే ఆదరించారు ఫస్ట్ వీకెండ్ లో. ఫస్ట్ వీక్ కలెక్షన్లు కూడా ఫరవాలేదు అనే రీతిలోనే వచ్చాయి. అదే టైమ్ లో సినిమాను కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి వుంటే బాగుండేది.
కానీ సినిమాను అక్కడే వదిలేసారు. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు తన మహర్షి సినిమా కోసం అమెరికా వెళ్లిపోయారు. యూనిట్ లో మరో కీలకవ్యక్తి శిరీష్ ఎఫ్ 2 సినిమా షూట్ కోసం బ్యాంకాక్ వెళ్లిపోయారు. ఇక్కడ సినిమాను పట్టించుకునేవారు లేకపోయారు. హీరో రామ్ అయినా ఇక్కడ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసుకుని వుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు.
దాంతో ఇప్పుడు సినిమాను తక్కువరేట్లకే ఇచ్చినా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అని ట్రేడ్ వర్గాల బోగట్టా. వైజాగ్, కృష్ణా, నైజాం దిల్ రాజు స్వంతమే కాబట్టి సమస్యలేదు. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ మాత్రం కాస్త లాస్ బయ్యర్లకు తప్పదు అని ట్రేడ్ వర్గాల సమాచారం.
కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్