అరవింద సమేత సినిమా ఎవరికి పనికివచ్చింది అంటే డైరక్టర్ త్రివిక్రమ్ కే. ఎన్టీఆర్ కు అప్పటికే మూడు సక్సెస్ లు వున్నాయి. పైగా తరువాత రాజమౌళి సినిమా వుంది. హారిక హాసిని నిర్మాణ సంస్థగా తన పని తాను చేసుకుంటోంది. కానీ అజ్ఞాతవాసి లాంటి పరమ వీర డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ జాడ ఎక్కడా కనిపించలేదు. చాలా సైలెంట్ గా అరవింద సినిమా చేసారు. కాస్త బాగుంది అని టాక్ వచ్చింది.
ఇక అంతే త్రివిక్రమ్ విజృంభించి మీడియా ముందుకు వచ్చారు. నిజానికి అరవింద సినిమా వల్ల ఒక్క నైజాం బయ్యర్ మినహా మరే ఒక్కరు కూడా కనీసం పెట్టుబడి రాబట్టుకోలేకపోయారు. ప్రతి ఒక్కరు లక్షల నుంచి కోట్ల వరకు లాస్ అయ్యే సూచనలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
హారిక హాసినితో సంబంధాలున్నవారే ఈస్ట్ గోదావరికి కొనుక్కున్నారు. ఇప్పుడు యాభై లక్షలు పెట్టుబడి పోతోంది అక్కడ. ఇక ఖర్చుల సంగతి దేవుడెరుగు. ప్రతి ఏరియా పరిస్థితి ఇదే. మరి త్రివిక్రమ్ ఏమంత గొప్ప సినిమా తీసినట్లు? ఏమంత విజయం సాధించినట్లు? ఈమాత్రం ఆడింది కాబట్టి, బన్నీ సినిమా ఛాన్స్ వచ్చింది.
అదే ఈ సినిమా వల్ల కలిగిన ప్రయోజనం అనుకోవాలి. ఇదే సినిమా మరికాస్త తేడా చేసి వుంటే, మళ్లీ కొన్నాళ్లు త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయేవారేమో?
అరవింద అమ్మకాలు.. రెండు వారాల వసూళ్లు
నైజాం……..17 కోట్లు………19.10 కోట్లు
సీడెడ్……..14.55………….13.60
ఉత్తరాంధ్ర……8.70………..7.50
కృష్ణ………….5.50…………..4.40
గుంటూరు……7.20………….7.14
ఈస్ట్……………6.05………….5.40
వెస్ట్………….4.80…………….4.70
నెల్లూరు……….3.00………….2.60
కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్