కాపీ కథల మురుగదాస్‌.?

ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ మరోసారి 'కాపీ కథ' వివాదంలో ఇరుక్కున్నాడు. వరుణ్‌ అనే ఓ కో-డైరెక్టర్‌ రిజిస్టర్‌ చేయించిన కథని మురుగదాస్‌ దొంగిలించి (కాపీ కొట్టి..), 'సర్కార్‌' సినిమా తెరకెక్కించాడన్నది ఆ వివాదం తాలూకు…

ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ మరోసారి 'కాపీ కథ' వివాదంలో ఇరుక్కున్నాడు. వరుణ్‌ అనే ఓ కో-డైరెక్టర్‌ రిజిస్టర్‌ చేయించిన కథని మురుగదాస్‌ దొంగిలించి (కాపీ కొట్టి..), 'సర్కార్‌' సినిమా తెరకెక్కించాడన్నది ఆ వివాదం తాలూకు సారాంశం. వివాదం ముదిరి పాకాన పడేసరికి, 'కోర్టు బయట' పరిష్కారం చూసుకోక తప్పలేదు 'సర్కార్‌' టీమ్‌కి. ఎందుకంటే, సినిమా రిలీజ్‌కి ముందర ఇలాంటి వివాదాలు సినిమాని ఇరకాటంలో పడేస్తాయ్‌ మరి.

30 లక్షల రూపాయల చెల్లింపుతోపాటుగా, 'టైటిల్స్‌లో పేరు' వేస్తామంటూ 'సర్కార్‌' టీమ్‌, 'కాపీ ఆరోపణలు' చేసిన వరుణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మురుగదాస్‌ మాత్రం, 'అబ్బే.. అదంతా ఉత్తదే.. ఒకేతరహా ఆలోచనలు ఇద్దరికి రావడం మామూలే.. ఇందులో కాపీ అన్న ప్రచారంలో వాస్తవంలేదు..' అంటున్నాడు. ఓ పక్క వివాదం సమసిపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో మురుగదాస్‌ వివరణ కొత్త వివాదానికి తెరలేపింది.

మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' తెలుగులోకి, 'ఖైదీ నెంబర్‌ 150' పేరుతో రీమేక్‌ అయిన విషయం విదితమే. తమిళ సినిమాకే 'కాపీ' వివాదం తెరపైకొచ్చింది. తెలుగు రీమేక్‌ దగ్గరకొచ్చేసరికి వివాదం ముదిరి పాకానపడింది. ఎలాగోలా ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగిందనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడేమో 'సర్కార్‌' సినిమాకి కూడా 'కాపీ' ఆరోపణలే రావడం గమనార్హం.

నిజానికి, దర్శకుడిగా మురుగదాస్‌కి మంచి పేరు ప్రఖ్యాతులే వున్నాయి. కథల ఎంపికలో మురుగదాస్‌ తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధకి సర్వత్రా ప్రశంసలు లభిస్తుంటాయి. అలాంటిది మురుగదాస్‌ కథలు 'కాపీ' వివాదాల్ని ఎదుర్కోవడమంటే ఆశ్చర్యకరమే.  

కలెక్షన్ల లెక్కలు నిజమేనా క్లారిటీ కోసం చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్