వార్డు మెంబర్ గా కూడా పనికిరానోడు సలహాలిస్తున్నాడు

కరోనా వేళ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోయి, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. కనీస విషయ పరిజ్ఞానం లేని లోకేష్ లాంటి వాళ్లు ఆరోపణలు చేస్తే ఎందుకు స్పందించాలని…

కరోనా వేళ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోయి, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. కనీస విషయ పరిజ్ఞానం లేని లోకేష్ లాంటి వాళ్లు ఆరోపణలు చేస్తే ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా గురించి లోకేష్ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు.

“పనికిరాని ట్వీట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు లోకేష్. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాలి. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని సన్నాసి, ఇంట్లో కూర్చొని ట్వీట్లు పెట్టుకుంటున్నాడు. లోకేశంకేం తెలుసు అసలు. ఆక్సిజన్ సరఫరా కేంద్రం చూసుకుంటోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి మెజారిటీ ఆక్సిజన్ ఏపీకి వస్తోంది. మిగతాది మహారాష్ట్రకు కేటాయించింది కేంద్రం. విజయవాడ హాస్పిటల్ లో ఆక్సిజన్ లేదని చెప్పిన బుద్దిలేనోడు లోకేష్.”

మరో మంత్రి పేర్ని నాని కూడా లోకేష్-చంద్రబాబు విమర్శల్ని తిప్పికొట్టారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన టైమ్ లో శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

“ఆంధ్రప్రదేశ్ లోని హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి మంచాన్ని కొవిడ్ పేషెంట్ కే ఇవ్వాలని చెప్పాం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం మెరుగ్గా పనిచేస్తున్నాం. ఆ విషయం కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు కూడా తెలుసు. చంద్రబాబుకు, లోకేష్ కు తెలియకపోవడం విచారకరం. ప్రభుత్వం ఏదైనా పనిచేయకపోతే, సలహాలు ఇవ్వాల్సింది పోయి, శవరాజకీయాలు చేస్తున్నారు తండ్రికొడుకులు.”

ఆక్సిజన్ కొరత కేవలం ఏపీలోనే ఉన్నట్టు లోకేష్ మాట్లాడుతున్నారని అన్నారు నాని. ఆస్పత్రుల్లో సామర్థ్యం కంటే ఎక్కువ మందికి చికిత్స అందిస్తున్న విషయాన్ని లోకేష్ గుర్తిస్తే మంచిదన్నారు.