అరవింద.. నికార్సయిన కలెక్షన్లు ఇవే..!

కలెక్షన్ల లెక్కలు ఎవరివి వారికి వుంటాయి. కూడికలు ఫ్యాన్స్ కు వుంటాయి. తీసివేతలు యాంటీ ఫ్యాన్స్ కు వుంటాయి. అయితే అసలు లెక్కలు అన్నవి ఎలాగూ వుంటాయి. అరవింద సమేత వీరరాఘవ రెండు వారాలకు…

కలెక్షన్ల లెక్కలు ఎవరివి వారికి వుంటాయి. కూడికలు ఫ్యాన్స్ కు వుంటాయి. తీసివేతలు యాంటీ ఫ్యాన్స్ కు వుంటాయి. అయితే అసలు లెక్కలు అన్నవి ఎలాగూ వుంటాయి. అరవింద సమేత వీరరాఘవ రెండు వారాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత చేసింది? నికార్సయిన కలెక్షన్లు ఏమిటి? దానికి సమాధానమే ఈ కింద అంకెలు.

ఈ అంకెలు ఒకటికి రెండుసార్లు డిస్ట్రిబ్యూటర్ సర్కిళ్లతో, నిర్మాణ యూనిట్ తో మాట్లాడి తెలుసుకుని క్రోడీకరించినవి. మహా అయితే రౌండప్ చేయడం వల్ల లక్షో, రెండు లక్షలో తేడా వుంటుంది కానీ, లక్షల్లో, కోట్లలో కాదు.

అందరూ ప్రచారం చేస్తున్నట్లు నైజాం 20 కోట్లు దాటేయలేదు. అలాగే నైజాం కొన్నది కూడా జస్ట్ 17 కోట్లకే. అది కూడా పూర్తి వైట్ మొత్తానికే. అరవింద ఏరియాల వారీ అమ్మకాలు, కలెక్షన్లు ఇలా వున్నాయి. కృష్ణాజిల్లా అమ్మలేదు. ఆ జిల్లా రూరల్ అమ్మారు.

మల్టీ ఫ్లెక్స్ లు మాత్రం నిర్మాతే వుంచుకున్నారు. అలాగే ఈస్ట్ ను నిర్మాత సన్నిహితులు ఏర్పాటు చేసిన సంస్థకే ఇచ్చారు. ఇదిలా వుంటే అరవింద చాలావరకు డెఫిసిట్ లు లేకుండా వుండడానికి ఒకటి, రెండు సెంటర్లు మాత్రమే వుంచి, మిగిలినవి తీసేసారు.

అయినా ఒకటి ఒకటీ అరా షోలకు డెఫిసిట్ లు తగులుతున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ అయితే సరిపోతోంది.

అరవింద అమ్మకాలు.. రెండు వారాల వసూళ్లు

నైజాం.…….17 కోట్లు………18.30 కోట్లు
సీడెడ్……..14.55………….13.30
ఉత్తరాంధ్ర……8.70………..7.40
కృష్ణ………….5.50…………..4.10
గుంటూరు……7.20………….7.14
ఈస్ట్.…………..6.05………….5.18
వెస్ట్………….4.80…………….4.62
నెల్లూరు……….3.00………….2.57

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి