సారీ.. ఇలాగైతే సినిమాలు చేయలేరట.!

'మీ.. టూ..' ఉద్యమం తాలూకు ప్రకంపనలు సినీ పరిశ్రమని గట్టిగానే కుదిపేస్తున్నాయి. ముద్దు సీన్లంటే 'అత్యుత్సాహం' ప్రదర్శించే నటులు ఇప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్లు సినిమాల్లో…

'మీ.. టూ..' ఉద్యమం తాలూకు ప్రకంపనలు సినీ పరిశ్రమని గట్టిగానే కుదిపేస్తున్నాయి. ముద్దు సీన్లంటే 'అత్యుత్సాహం' ప్రదర్శించే నటులు ఇప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్లు సినిమాల్లో సర్వసాధారణమైపోయిన దరిమిలా, ఏ హీరోయిన్‌ ఎప్పుడెలా తమమీద నిందలేస్తుందోనన్న టెన్షన్‌ ఆయా నటుల్ని వెంటాడుతోంది మరి.

ఓ హిందీ సినిమా షూటింగ్‌ సందర్భంగా 'రేప్‌' సన్నివేశమొకటి వుంటే, సదరు సన్నివేశంలో నటించాల్సి నటుడు, ఆ సన్నివేశంలో నటించే నటితో 'ఒప్పుకోలు సర్టిఫికెట్‌' అడిగాడట. పైగా, 'సమ్మతి వీడియో' కూడా కోరాడట. ఇది ఒక్క హిందీ పరిశ్రమలోనే కాదు.. చాలా సినీ పరిశ్రమల్లో 'కామన్‌'గా మారిపోతోంది. ఇలాగైతే, ముందు ముందు సినిమాలు చేయడం చాలా కష్టమైపోతుందన్నది చాలామంది సినీజనాల మాట.

ఇదిలా వుంటే, తాజాగా హీరోయిన్‌ అమలాపాల్‌ దర్శకుడు సుశి గణేశన్‌తోపాటు, అతని భార్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఓ సినిమా షూటింగ్‌ సందర్భంలో దర్శకుడు డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో వేధించాడన్నది అమలాపాల్‌ ఆరోపణ.

ఈ మేరకు సోషల్‌ మీడియాలో 'సుదీర్ఘంగా రాసిన లేఖ'ని పోస్ట్‌ చేసింది. ఆ లేఖ తర్వాత, అమలా పాల్‌కి ఆ దర్శకుడి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయట. దర్శకుడు సుశి గణేషన్‌తోపాటు, అతని భార్య కూడా తనను ఫోన్‌లో తిట్టిందంటూ మరో పోస్ట్‌ చేసింది అమలాపాల్‌ సోషల్‌ మీడియాలో.

సౌత్‌ సినిమాకి సంబంధించి పలువురు సినీ ప్రముఖులు ఆల్రెడీ 'మీ..టూ..' వివాదంలో ఇరుక్కున్నారు. కొత్త కొత్తగా పలువురి పేర్లు తెరపైకి వస్తూనే వున్నాయి. 'దొరికినవన్నీ చిన్న చేపలే.. పెద్ద చేపలకు వుంది మొసళ్ళ పండగ..' అంటూ ఆయా సినీ పరిశ్రమలో ఆఫ్‌ ది రికార్డ్‌గా కామెంట్స్‌ విన్పిస్తుండడం గమనార్హం.

ఈ 'మీ.. టూ..' వివాదాల దెబ్బకి బాలీవుడ్‌లో పలు చిత్రాల నిర్మాణం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ వివాదానికి ముగింపు ఎలా పడ్తుందోగానీ.. సినిమాల్లో 'ఆ తరహా సన్నివేశాలు' వద్దు మొర్రో.. అనేవారి సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి