అమృతం సీరియల్ అంటే ఇప్పటికీ తెలుగు జనాలు ఎక్కడ వున్నా హాయిగా ఫీలవుతారు. ఏనాడో ఆగిపోయిన ఆ సీరియల్ ఎపిసోడ్ లకు ఇప్పటికీ యూ ట్యూబ్ లో విపరీతమైన ఆదరణ. అయితే ఇప్పుడు అవి యూ ట్యూబ్ లో కనిపించవు అనుకోండి. ఎందకుంటే అమృతం సీరియల్ మీద పూర్తి హక్కులను జీ టీవీ తీసేసుకుంది. తీసుకోవడమే కాదు, అమృతం 2 అంట మళ్లీ తన ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ మీద సిరీస్ ను ప్రెజెంట్ చేయబోతోంది.
సర్వర్ సుందరం, అమృతరావు అలియాస్ అమృతం, అంజనేయులు అలియాస్ అంజి, ఇంటి ఓనర్ పాత్రలు అన్నీ ఇప్పటికీ సజీవమే. ఇప్పుడు మళ్లీ అదే ఫ్లావర్ తో అదే అమృతాన్ని అందించబోతున్నారు. ఉగాది నుంచి ఈ సిరీస్ స్టార్ట్ కాబోతోంది.
అమృతం బుల్లి తెర పై వీక్లీ సీరియల్ గా ఆరు సంవత్సరాలపాటు ప్రసరమైయింది. పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళి లొల్లి చెయ్యడానికి ప్రేక్షకులను కవ్వించి నవ్వించడానికి రెడీ అవుతోంది. గుణ్ణం గంగరాజు, జీ 5 కలిపి ఈ వెంచర్ చేపడుతున్నారు.
అమృతం ద్వితీయం లో హర్షవర్ధన్, శివ నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, ఎల్ బి శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ మరియు రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు.