బాధపడుతున్న వంశీ పైడిపల్లి

సినిమా చేతిలోంచి చేజారిపోతే పెద్ద సమస్య ఏమీ కాదు. పెద్ద దర్శకులు వెంటనే మరో సినిమాను చేతిలోకి తీసుకుంటారు. సుకుమార్ స్క్రిప్ట్ ను సూపర్ స్టార్ మహేష్ కాదంటే, ఆయన ఆ వెంటనే బన్నీతో…

సినిమా చేతిలోంచి చేజారిపోతే పెద్ద సమస్య ఏమీ కాదు. పెద్ద దర్శకులు వెంటనే మరో సినిమాను చేతిలోకి తీసుకుంటారు. సుకుమార్ స్క్రిప్ట్ ను సూపర్ స్టార్ మహేష్ కాదంటే, ఆయన ఆ వెంటనే బన్నీతో అదే ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం మహేష్ తో ప్రాజెక్టు క్యాన్సిల్ కావడాన్ని అంత సులువుగా మనసులోంచి తీయలేకపోతున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

మరీ ఎక్కువగా మహేష్ తో అసోసియేట్ అయిపోవడం, మహర్షి సినిమా నుంచి నిన్న మొన్నటి వరకు రెండు కుటుంబాలు బాగా కలిసి కనిపించడం, పార్టీలు చేసుకోవడం, సరిలేరు నీకెవ్వరు సినిమాకు మహేష్ ను ఇటు వంశీ, అటు మహేష్ కుమార్తెలు కలిసి ఇంటర్వూ చేయడం, ఇలా ఒకటి కాదు. రెండు కుటుంబాలు ఒక్కటే అన్నంతగా కలిసిపోయాయి.

అలాంటిది ఒక్కసారిగా ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. కానీ వంశీ కూడా దానికి బాధపడడం లేదని బోగట్టా. స్క్రిప్ట్ నచ్చలేదు.  మరో స్క్రిప్ట్ చేయమని అడగడం వేరు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం వేరు. ప్రాజెక్టు క్యాన్సిల్ చేయడం వేరు, దాన్ని ప్రచారంలోకి తీసుకురావడం వేరు. ఇలా క్యాన్సిల్ అయిన వెంటనే అలా మాధ్యమాల్లోకి రావడం వెనుక మహష్ టీమ్ నే వుందని వంశీ భావిస్తున్నారు. ఇది ఓ అవమానంగా ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి వార్తలు పదేపదే రావడం,  స్క్రిప్ట్ చేయలేకపోయాడు, మహేష్ ఇచ్చిన అవకాశం నిలబెట్టుకోలేకపోయాడు లాంటి వార్తలు స్ప్రెడ్ కావడం వంటి వాటితో వంశీ పైడిపల్లి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి క్షేమమేనా?