నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన భీష్మ సినిమా నైజాంలో మంచి ఫీట్ సాధించింది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అయిదున్నర కోట్ల నాన్ రికవరబుల్ అడ్వాన్స్ మీద ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేసారు. మూడు రోజులకు 5.93 కోట్లు వసూలు చేసింది. అంటే ఖర్చులతో సహా వచ్చినట్లే. ఇక కమిషన్ రావాలి.
మిగిలిన ఏరియాలు కూడా దాదాపుగా 80 శాతం వరకు మూడు రోజుల్లోనే రికవరీ అయిపోవడం విశేషం. విశాఖ కు 2.25 కడితే 1.80 రికవరీ వచ్చింది. మరో మూడు వారాల వరకు సరైన సినిమా లేదు. వీక్ డేస్ వదిలేసినా, వీకెండ్ లు చాలు సినిమా బయ్యర్లు హ్యాపీ అయిపోవడానికి.
మూడో రోజు కలెక్షన్లు ఇలా వున్నాయి.
Nizam 1.83
Ceeded 0.72
UA 0.58
East 0.28
West 0.17
Krishna 0.33
Guntur 0.35
Nellore 0.11
మూడు రోజుల కలెక్షన్లు ఇలా వున్నాయి.
Nizam 5.93
Ceeded 2.24
UA 1.79
East 1.20
West 0.88
Krishna 0.92
Guntur 1.37
Nellore 0.48