వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా వుండే వార్త. మహేష్ లాంటి స్టార్ హీరో ప్రవీణ్ సత్తారు లాంటి మీడియం దర్శకుడితో సినిమా చేస్తారా? కానీ వినిపిస్తున్న విషయం ఏమిటంటే, ప్రవీణ్ సత్తారు చెప్పిన ఓ కథను మహేష్ 80శాతం ఒకె చేసారు అన్నది. అంత మాత్రం చేత ఆ ప్రాజెక్టు వుంటుందనీ కాదు, వుండదనీ కాదు.
పరిశీలనలో అయితే వుంది. ప్రవీణ్ సత్తారు గతంలో గరుడవేగ సినిమా తీసి, ఇండస్ట్రీ దృష్టిని కాస్త ఆకర్షించారు. రాజశేఖర్ తో ఆ రేంజ్ సినిమా ఆ మాత్రం తీయడం గొప్ప విషయమే. బహుశా ఇది గమనించో, లేదా ప్రవీణ్ చెప్నిన కథ నచ్చో మహేష్ కొంచెం కదిలి వుండొచ్చు అని తెలుస్తోంది.
ప్రవీణ్ చెప్పిన కథ చాలా వరకు ఓకె అయిందని, కొన్ని డిస్కషన్లు, కొన్ని మార్పులు చేర్పులు స్టేజ్ లో ఈ ప్రాజెక్టు వుందని తెలుస్తోంది. మహేష్ వ్యవహారాల్లో యాక్టివ్ గా వుండే నమ్రత కూడా ఈ ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా వున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ కుసరైన లైనప్ అయితే లేదు.అందువల్ల ప్రవీణ్ సత్తారు సరైన కథ చెప్పగలిగితే ప్రాజెక్టు పట్టాలు ఎక్కినా ఆశ్చర్యం లేదు.