దటీజ్ జగన్: కష్టకాలంలో కూడా ఆగని సాయం

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇలాంటి టైమ్ లో కరోనా కష్టాలొచ్చాయి.  Advertisement ఇదే పరిస్థితుల్లో…

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇలాంటి టైమ్ లో కరోనా కష్టాలొచ్చాయి. 

ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే.. కరోనా పేరును అడ్డు పెట్టుకుని అన్నిట్లో కోత పెట్టేవారు, వాతలేసేవారు. కానీ జగన్ అలా కాదు, కష్టకాలంలో నిజమైన నాయకుడనిపించుకున్నారు.

గతేడాది లాక్ డౌన్ కష్టాల్లో కూడా వ్యవసాయ పనులు ఆగకుండా నిబంధనలు సడలించి రైతులకు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకున్న జగన్.. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద 1400 కోట్ల రూపాయలు నిధులు బ్యాంకుల్లో జమచేసి చేసి శెహభాష్ అనిపించుకున్నారు. ఈ ఏడాది కూడా సెకెండ్ వేవ్ లో కరోనా మరోసారి కోరలు చాస్తున్నప్పటికీ జగన్ వెనకడుగు వేయలేదు. 

ఓవైపు ఆర్థిక కష్టాలు తరుముతున్నప్పటికీ సంక్షేమమే థ్యేయంగా దూసుకుపోతున్నారు. తన లక్ష్యంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలకు మరోసారి సున్నా వడ్డీకే నిధుల్ని ఆన్ లైన్ ద్వారా ఈరోజు విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్. 

కోటి 2 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 1,109 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందజేసి మహిళా సాధికారతను ఆచరణలోకి తీసుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో తుపాను వస్తే, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఓ సంక్షేమ పథకాన్ని అటకెక్కించారు. ఆ నిధుల్ని తుపాను నివారణ, సహాయక చర్యల కోసం వెచ్చించామని చెప్పుకొచ్చారు. కానీ జగన్ పాలనలో అలాంటి మాయమాటల్లేవ్. 

ఇచ్చిన మాట ప్రకారం, నవరత్నాల్ని అమలు చేస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్.. ఇలా అన్నీ చెప్పిన తేదీకి ఇంటి గుమ్మం ముందుకు అందిస్తున్నారు.

మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా కట్టడితోనే సతమతమవుతున్న వేళ, ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనా కష్టకాలంలో కూడా మిగతా అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. గతేడాది కరోనా కాలంలోనే తన దక్షత ఏంటో చేతలతో దేశానికి చాటిచెప్పిన జగన్, ఇప్పుడు మరోసారి తన సమర్థతను చాటుకుంటున్నారు.