‘సిట్’ కేరక్టర్ దెబ్బతీయడమే లక్ష్యం!

తెలుగుదేశ నాయకులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏం నిగ్గు తేలుస్తుందో… ఏం అక్రమాలు వెలుగులోకి వస్తాయో అనేది వారి చింత. రాజకీయ నాయకుడికి…

తెలుగుదేశ నాయకులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏం నిగ్గు తేలుస్తుందో… ఏం అక్రమాలు వెలుగులోకి వస్తాయో అనేది వారి చింత. రాజకీయ నాయకుడికి కేసులు తేలడమూ శిక్షలు పడడమూ పెద్ద విషయం కాదు.. తన మోసాన్ని ప్రజలు తెలుసుకునేస్తారేమో అనేదే పెద్ద చింతగా ఉంటుంది. ఆ తరహాలోనే తెలుగుదేశం దళాలు కూడా ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇందుకు వారు ఎన్నుకున్న వ్యూహం ఒక్కటే. అసలు ‘సిట్’ కేరక్టర్ నే దెబ్బతీయడం!

కాల్ ది డాగ్ మ్యాడ్.. బిఫోర్ యూ కిల్ ఇట్ అని ఇంగ్లిషులో  ఒక సామెత ఉంటుంది.  ఆ సామెత చెప్పే నీతినే కొంచెం అటు ఇటుగా మార్చి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు అనుసరిస్తున్నారు. అసలు ఈ సిట్ అనేదే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే వ్యవస్థ అని చాటి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఈ బాధ్యతను తెలుగుదేశం తరఫున యనమల రామకృష్ణుడు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఐదేళ్ల పాలనపై సిట్ వేసిన చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడా లేదని యనమల మండిపడుతున్నారు. ఆ ముక్క నిజమే. తెలుగురాష్ట్రాల ప్రజలు కూడా అదే మాట అనుకుంటున్నారు. అయిదేళ్లలోనే చంద్రబాబు స్థాయిలో భారీగా అవినీతికి కుట్రలకు పాల్పడడం ఎక్కడా లేదనే వారు కూడా అనుకుంటున్నారు. మామూలు పోలీసు విచారణలు ఇవన్నీ అంత స్థాయి అవినీతిని తేల్చలేకపోతున్నాయి గనుకనే.. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల సహా ప్రత్యేకదర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కూడా ప్రజలు భావిస్తున్నారు.

నిజానికి సీఆర్డీయే భూముల కొనుగోలు, అక్రమ లావాదేవీలే.. ఒక సిట్ ఏర్పాటు చేయడానికి తగినంత భారీ స్థాయిలో ఉన్నాయని.. జగన్మోహన రెడ్డి .. ఆ సీఆర్డీయేతో పాటు, అయిదేళ్ల పాలనను కూడా కలిపి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలోని సిట్  మీద ఒత్తిడిపెట్టినట్టేనని ప్రజలు అనుకుంటున్నారు. కాగా, తెదేపా నాయకులు మాత్రం.. ముందుగానే ఈ సిట్ అధికారులు.. వైకాపాకు అనుచిత సంబంధాలను అంటగట్టేస్తే వారు తమ మీద నెగటివ్ రిపోర్టు ఇచ్చినా కేసులు పెట్టినా.. అవన్నీ రాజకీయ ప్రేరేపితాలంటూ గోలచేయవచ్చుననేది వారి వ్యూహంగా ఉంది.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు