త్రివిక్రమ్ బాకీలు తీర్చరేమో?

బాహుబలి లాంటి అత్యంత భారీ సినిమాలు తీసిన రాజమౌళి ఎప్పడో పూర్వాశ్రమంలో తీసుకున్న అడ్వాన్స్ నిర్మాత దానయ్యది. నిజానికి రాజమౌళి అనుకుంటే, అంతకు అంతా వేసి ఇచ్చి, తప్పించుకోవచ్చు. దానయ్య కూడా పెద్దగా ఫైట్…

బాహుబలి లాంటి అత్యంత భారీ సినిమాలు తీసిన రాజమౌళి ఎప్పడో పూర్వాశ్రమంలో తీసుకున్న అడ్వాన్స్ నిర్మాత దానయ్యది. నిజానికి రాజమౌళి అనుకుంటే, అంతకు అంతా వేసి ఇచ్చి, తప్పించుకోవచ్చు. దానయ్య కూడా పెద్దగా ఫైట్ చేసే పరిస్థితి వుండదు. కొరటాల శివ ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్. ఆ మాట మీదే వుండి భరత్ అనే నేను సినిమా చేసారు. అది మాట, అడ్వాన్స్ కు వున్న నిబద్దత.

దర్వకుడు త్రివిక్రమ్ ఎప్పడో తీసుకున్న అడ్వాన్స్ లు రెండు వున్నాయి. ఒకటి మైత్రీ మూవీస్ దగ్గర, రెండవది డివివి దానయ్య దగ్గర. కానీ ఈ ఇద్దరికీ సినిమాలు చేయడం మాత్రం కనిపించడం లేదు. హారిక హాసిని సంస్థ అంటే త్రివిక్రమ్ స్వంత సంస్థ అన్నంతగా పెనవేసుకుపోయారు. దాంతో ప్రతి సినిమా ఆ సంస్థకే చేస్తూ వస్తున్నారు. అలా అని అడ్వాన్స్ లు వెనక్కు వెళ్లలేదు.

ఇప్పుడు మళ్లీ మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. బన్నీ హీరోగా త్రివిక్రమ్ సినిమా దాదాపు ఫైనల్ అయినట్లే. అనౌన్స్ మెంట్ నే బకాయి. కానీ ఏ బ్యానర్ కు చేస్తారు? అన్నది అనుమానం. మళ్లీ హారిక హాసిని అంటారా? లేక బన్నీ కూడా దానయ్యకు ఓ సినిమా చేయాలని అనుకున్నారు కనుక, అటు చేస్తే ఓ బాకీ తీరిపోయినట్లు వుంటుంది. లేదా మైత్రీ ఎప్పటి నుంచో బన్నీతో సినిమా చేయాలని అనుకుంటోంది. అలా చేస్తే అటు బాకీ తీరిపోతుంది.

ఇప్పుడు ఈ విషయమే తేలక, బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రకటన ఆగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అంటే వందకోట్ల సినిమా. అలాంటి వందకోట్ల సినిమాను హారిక హాసిని ఎందుకు వదులుకుంటుంది? త్రివిక్రమ్ తో ఎలాగోలా తమకే చేయమని వత్తిడి చేసే అవకాశం వుంది.

కానీ ఫర్ ఎ ఛేంజ్ ఓ సినిమాను బయట బ్యానర్ లో చేయాలని ఈసారి త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. నిజంగా అలా అనుకుంటే డివివి దానయ్య పంట పండినట్లే. మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, రాజమౌళి-ఎన్టీఆర్-చరణ్ లతో ఆర్.. ఆర్.. ఆర్.. ఇలాంటి మూడు క్రేజీ ప్రాజెక్టుల సరసన త్రివిక్రమ్-బన్నీ ప్రాజెక్టు కూడా వుంటుంది.

చూడాలి, ఇంతకీ త్రివిక్రమ్ మనసులో ఏముందో?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి