‘బాబు’ డబ్బింగ్ కు ఎందుకు నో అన్నట్లు?

వీరభోగ వసంత రాయలు ట్రయిలర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా, హీరో సుధీర్ బాబు సంగతేమిటి? అన్న క్వశ్చన్లు రేకెత్తించింది. ఆ ట్రయిలర్ లో సుధీర్ బాబుకు వేరే వాయిస్ తో డబ్బింగ్ చెప్పించారు?…

వీరభోగ వసంత రాయలు ట్రయిలర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా, హీరో సుధీర్ బాబు సంగతేమిటి? అన్న క్వశ్చన్లు రేకెత్తించింది. ఆ ట్రయిలర్ లో సుధీర్ బాబుకు వేరే వాయిస్ తో డబ్బింగ్ చెప్పించారు? అలా ఎందుకు జరిగింది? అన్నది అసలు సిసలు ప్రశ్న.

డబ్బింగ్ కు సుధీర్ బాబు నో అని చెప్పడం వల్లనే ఇదంతా అని తెలుస్తోంది. ట్రాక్ వాయిస్ సిస్టమ్ లో సినిమా మొత్తానికి వేరే వ్యక్తితో సుధీర్ బాబు క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పించేసారని తెలుస్తోంది. ఇప్పుడు ట్రయిలర్ లో సుధీర్ వాయిస్ మీద విమర్శలు రావడంతో, సుధీర్ బాబు తాను కారణాలు వెల్లడించలేనని, కానీ వాయిస్ తనది కాదని మాత్రం చెప్పగలనని ట్వీట్ చేసారు.

అయితే ఆ వెల్లడించలేకపోయిన అసలు కారణాలు ఏమిటి అన్నది తెలియాల్సి వుంది. సుధీర్ బాబు టీమ్ నుంచి వస్తున్న ఆన్సర్ చిత్రంగా వుంది. సినిమా పూర్తయిన తరువాత సుధీర్ చూసారని, అవుట్ పుట్ మీద సంతృప్తి లేక, డబ్బింగ్ చెప్పలేదని అంటున్నారు. అది కరెక్ట్ కాకపోవచ్చు. సుధీర్ బాబు గతంలో డబ్బింగ్ చెప్పిన సినిమాలు అన్నీ అద్భుతమైనవేనా? ఏమిటి?

రెమ్యూనిరేషన్ దగ్గర ఏదో తేడా వచ్చి, డబ్బింగ్ చెప్పలేదని కూడా వినిపిస్తోంది. ఇప్పుడు సుధీర్ బాబును ఒప్పించి, డబ్బింగ్ మార్చే పనిలో యూనిట్ చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే కెరీర్ అంతంతమాత్రంగా వున్న టైమ్ లో సుధీర్ బాబుకు ఇలాంటి తకరారులు ఎందుకో?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి