అరవిందను దెబ్బతీసిన తితిలీ

శ్రీకాకుళం జిల్లా కనీవినీ ఎరుగనంత దెబ్బతింది తితిలీ తుపాను కారణంగా. విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు బాగానే కురిసాయి. గత మూడు రోజులుగా విశాఖ జిల్లాలో కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇవన్నీ కలిసి…

శ్రీకాకుళం జిల్లా కనీవినీ ఎరుగనంత దెబ్బతింది తితిలీ తుపాను కారణంగా. విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు బాగానే కురిసాయి. గత మూడు రోజులుగా విశాఖ జిల్లాలో కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇవన్నీ కలిసి అరవింద సమేత వీరరాఘవ సినిమా కలెక్షన్లు గట్టిగానే దెబ్బతీసినట్లు ట్రేడ్ సర్కిళ్ల బోగట్టా.

అరవిందను ఉత్తరాంధ్రకు తొమ్మిదిన్నర కోట్ల భారీరేటుకు కొన్నారు. ఇప్పటికి కలెక్షన్లు 5.62 కోట్ల వరకు నమోదు అయ్యాయి. అంటే కనీసం ఇంకో నాలుగు కోట్లకు పైగా రావాలి. ఇది అసాధ్యమైన ఫీట్ గానే కనిపిస్తోంది. వర్షాలు ఈ రేంజ్ లో ఉత్తరాంధ్రలో లేకుంటే, కనీసం ఇప్పటికి మరో కోటి నుంచి కోటిన్నర యాడ్ అయ్యేదని అంటున్నారు.

నైజాం 17 కోట్లేనంట
నైజాం ఏరియా హక్కులు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తీసుకున్నారు. 18 కోట్లు అని కొందరు, కాదు 19 కోట్లు అని మరి కొందరు టాలీవుడ్ లో చెబుతున్నారు. కానే కాదని, 17 కోట్ల వైట్ అమౌంట్ కే ఇచ్చామని హారిక వర్గాలు అంటున్నాయి.

ఆ లెక్కన ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అలా బ్రేక్ ఈవెన్ కావాలన్నా మరో మూడు నాలుగు కోట్ల వరకు రావాలి. పండగరోజులు ముందు వుండడం ఆ ధీమాకు కారణం కావచ్చు.

ఇదిలా వుంటే ఆంధ్రలో టికెట్ రేటును నార్మల్ చేసాక, థియేటర్లకు క్రౌడ్ పెరిగింది కానీ రెవెన్యూ కనిపించడం లేదు. అయితే అలా అని సినిమా జారిపోలేదు. అదే బయ్యర్లకు కాస్త ధైర్యం ఇస్తోంది. 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి