మరో పదిహేను రోజుల్లో నాగచైతన్య సవ్యసాచి సినిమా స్క్రీన్ మీదకు రాబోతోంది. ఒక విధంగా ఈ సినిమా చైతన్య కెరీర్ కు యాసిడ్ టెస్ట్ లాంటిది. సరైన హిట్ లేకుండా వుంది చైతూ కెరీర్. దోచేయ్ వరకు ఎక్కువ ఫ్లాపులే.. ప్రేమమ్.. రారండోయ్ వేడుక చూద్దాం.. ఈ రెండింటిలో ప్రేమమ్ ఓకె అనిపించుకుంది. రారండోయ్ మంచి హిట్ అయింది. మధ్యలో సాహసం శ్వాసగా సాగిపో, ఆ తరువాత యుద్ధం శరణం ఫ్లాపులే. శైలజారెడ్డి అల్లడు యావరేజ్. ఇలాంటి ట్రాక్ రికార్డు నాగచైతన్య ది.
ఇలాంటి టైమ్ లో సవ్యసాచి అంటూ మళ్లీ తనకు అస్సలు హిట్ అన్నది ఇవ్వని యాక్షన్ జోనర్ లో సినిమా అందిస్తున్నాడు చైతన్య. అందుకే ఈ సినిమాకు అమ్మ-కొడుడు, అక్క-తమ్ముడు అనే సెంటిమెంట్ అద్దకం అద్దుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి సవ్యసాచి అక్క-తమ్ముడు-మేనగోడలు-విలన్ ల మధ్య నడిచే కథ సవ్యసాచి అని వినికిడి.
ఈ సినిమా హిట్ మీదనే నాగచైతన్య కెరీర్ ఆధారపడి వుంది. ప్రస్తుతానికి శివనిర్వాణ డైరక్షన్ లో ఓ సినిమా సెట్ మీద వుంది. అది కాదు సమస్య. సినిమాకు మార్కెట్, ఓపెనింగ్స్ అవీ అసలు సమస్యలు. సవ్యసాచి సినిమాను అండర్ రేట్ కు అమ్మాల్సి వచ్చింది. ఆంధ్రలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్యన అమ్మితే తప్ప మార్కెట్ కాలేదు.
ఇప్పుడు ఓపెనింగ్స్ బాగుండి, సినిమా హిట్ అనిపించుకుంటేనే కొత్త ప్రాజెక్టులు వస్తాయి. లేదంటే, స్వంత బ్యానర్ పైనే చేసుకోవాల్సి వుంటుంది. అందుకే ఇప్పటి నుంచి ప్రమోషన్ లలో సెంటిమెంట్ పాళ్లు దట్టించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్లు.